IND vs SA 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం.. 12 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ కైవసం.. ధావన్ సరసన సరికొత్త రికార్డ్..

|

Oct 11, 2022 | 6:56 PM

సౌతాఫ్రికా అందించిన టార్గెట్‌ను కేవలం 20 ఓవర్లలోపే ఛేదించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. దీంతో ధోని, కోహ్లీలకు సాధ్యంకాని రికార్డ్‌ను ధావన్ సొంతం చేసుకున్నాడు.

IND vs SA 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం.. 12 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ కైవసం.. ధావన్ సరసన సరికొత్త రికార్డ్..
Ind Vs Sa 3rd Odi
Follow us on

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా అందించిన టార్గెట్‌ను కేవలం 20 ఓవర్లలోపే ఛేదించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాపై స్వదేశంలో వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆఫ్రికన్ జట్టు మొత్తం 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 1999లో ఆఫ్రికన్ జట్టును భారత్ 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది. దీంతో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 14 బంతుల్లో 8 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం శుభ్మన్ గిల్ 49 పరుగులు చేసి, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులతో అజేయంగా నిలిచి, టీమిండియాకు విజయాన్ని అందించాడు. అంతకుముందు 2010లో టీమిండియా చివరిసారిగా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో, 2015లో, ధోనీ కెప్టెన్సీలో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-3 తేడాతో ఓడిపోయింది.

శ్రేయాస్ అయ్యర్ విన్నింగ్ షాట్ వీడియో..

ఇరు జట్ల ప్లేయింగ్ XI..

టీమ్ ఇండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కీపర్), యెనెమన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), మార్కో జాన్సన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, జార్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్త్యా.