IND vs PAK: మెన్స్ అయినా.. ఉమెన్స్ అయినా.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే

క్రికెట్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రేజ్ వేరు. తాజాగా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మంధాన 68, కోహ్లీ 82 (2022 టీ20 వరల్డ్ కప్) పాక్‌పై టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు. '18' జెర్సీ ఆటగాళ్లు ఈ రికార్డులు సాధించడం విశేషం.

IND vs PAK: మెన్స్ అయినా.. ఉమెన్స్ అయినా.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
Virat Kohli And Smriti

Updated on: Jun 15, 2026 | 11:28 AM

క్రికెట్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజే వేరు. అది మెన్స్ క్రికెట్ అయినా, ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఆ హైప్‌కు క్రికెట్ ఫ్యాన్స్ పిచ్చొళ్లు అయిపోతుంటారు. తాజాగా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఎప్పటిలాగే టీమిండియా, పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టీ20 వరల్డ్ కప్పుల్లో మెన్స్ టీమిండియా 9 మ్యాచ్‌ల్లో 8 సార్లు గెలిస్తే, ఉమెన్స్ టీమిండియా 9లో 7 సార్లు గెలిచింది. మొత్తంగా పాకిస్థాన్‌పై మెన్స్ అయినా, ఉమెన్స్ అయినా తిరుగులేని రికార్డు కలిగి ఉన్నారు.

అయితే పాకిస్థాన్‌పై నంబర్ 18 జెర్సీ ప్లేయర్లు మాత్రం సమయం వచ్చినప్పుడల్లా రెచ్చిపోతూనే ఉన్నారు. మెన్స్ క్రికెట్‌లో 18 నంబర్ జెర్సీ ధరించేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అలాగే ఉమెన్స్ క్రికెట్‌లో కూడా ఆ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎస్.. విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన ఈ ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్లు పాకిస్థాన్ అంటే చాలా పూనకాలు వచ్చినట్లు బ్యాటింగ్ చేస్తుంటారు. తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సూపర్ బ్యాటింగ్‌తో దుమ్ములేపింది. 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 భారీ సిక్సులతో 68 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన 82 పరుగులు ఇన్సింగ్స్‌ను ఎవరు మర్చిపోగలరు.

ఇప్పుడు ఈ రెండు ఇన్సింగ్స్‌ల మధ్య పోలిక ఏంటంటే.. పాకిస్థాన్‌పై టీమిండియా తరఫున టీ20ల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు ఇవే. పాకిస్థాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు కోహ్లీ, మంధాన కలిగి ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన 68, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసి రాణించారు. చివరల్లో రిచా ఘోష్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసి సూపర్ ఫినిష్ ఇచ్చింది. ఇక భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌ను టీమిండియా బౌలర్లు 106 పరుగులకే చుట్టేశారు. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టింది. శ్రీ చరణి 3, షఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us