
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ప్రస్తుతం ఐసీసీతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐసీసీ ప్రతినిధి బృందం లాహోర్‌కు చేరుకుని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యింది. అయితే ఈ గొడవ సద్దుమణగాలంటే పాక్ మూడు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచినట్లు సమాచారం.
పాక్ పెట్టిన ఆ మూడు డిమాండ్లు ఏమిటి?
బంగ్లాదేశ్ జట్టుకు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్, ఇప్పుడు ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మూడు కండిషన్లు పెట్టారు.
రెవెన్యూ వాటా పెంపు: ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు వచ్చే వార్షిక నిధులను పెంచాలి.
ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా ఐసీసీ చొరవ చూపాలి.
క్రీడా స్ఫూర్తి (హ్యాండ్ షేక్): మైదానంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసేలా (గతంలో జరిగిన కొన్ని గొడవల నేపథ్యంలో) ప్రొటోకాల్స్ ఉండాలి.
భారీ జరిమానా తప్పదా?
పాకిస్థాన్ సాకులుగా చూపుతున్న ఫోర్స్ మెజ్యూర్(Force Majeure – నియంత్రించలేని పరిస్థితులు) క్లాజ్‌ను ఐసీసీ తిరస్కరించింది. కేవలం ఒక మ్యాచ్‌కే ఈ క్లాజ్ ఎలా వర్తిస్తుందని ఐసీసీ ప్రశ్నించింది. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు సుమారు 30 నుంచి 35 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని, ఆ మొత్తాన్ని పీసీబీ నిధుల నుండే వసూలు చేస్తామని హెచ్చరించింది. అదనంగా మరిన్ని కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
తుది నిర్ణయం ప్రధాని చేతుల్లోనే
పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ కానున్నారు. ఐసీసీతో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి, భారత మ్యాచ్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ వల్ల తమ పర్యాటక రంగం దెబ్బతింటుందని, ఆడాలని పాక్‌ను కోరింది. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, కొలంబో విమానం కూడా బుక్ అయిందని స్పష్టం చేశారు. మరి కొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..