KL Rahul: కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం.. అంపైర్ నిద్రపోతున్నాడా?.. మండిపడుతున్న నెటిజన్స్

|

Oct 24, 2021 | 9:02 PM

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపనర్ కేఎల్ రాహుల్(3) ఔట్‌ వివాదాస్పదమయ్యింది.

KL Rahul: కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం.. అంపైర్ నిద్రపోతున్నాడా?.. మండిపడుతున్న నెటిజన్స్
Kl Rahul Wicket (Photo: Twitter)
Follow us on

India vs pakistan ICC T20 Worldcup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపనర్ కేఎల్ రాహుల్(3) ఔట్‌ వివాదాస్పదమయ్యింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే రీప్లే‌లో బౌలర్ షాహీన్ అఫ్రిది నో బాల్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడం పట్ల భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అంపైర్ తప్పుడు నిర్ణయంపై మండిపడుతున్నారు. అంపైర్ నిద్రపోతున్నాడా? అంటూ నో బాల్‌కు సంబంధించిన ఫోటోను కూడా జతచేర్చుతో ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read..

Rohit Sharma: రోహిత్ శర్మ నువ్వు ఇంత చెత్తగా ఆడుతావనుకోలేదు.. మండిపడుతున్న నెటిజన్స్

Viral Video: వామ్మో..ఈ పెళ్లికూతురు స్పీడు మామూలుగా లేదు.. వీడియో