
ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆతిథ్య భారత్ మధ్య ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తున్న ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ మ్యాచ్ జరగడం అనుమానంగానే ఉందని చెబుతున్నారు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేలో ముగిసింది. ఇప్పుడు ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కి కూడా వర్షం అంతరాయం కలిగింది. ఆదివారం నాటి మ్యాచ్‌కి ఉరుములు, పిడుగులతో కూడా వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, మధ్యాహ్నం టాస్ సమయంలో, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మధ్యాహ్నం 1 గంట తర్వాత 51 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ప్రతి గంటకు వర్షం తీవ్రత క్రమంగా తగ్గుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఇండో-కివీస్ మ్యాచ్ టాస్ ఆలస్యం కావచ్చు. అంతకుముందు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది.
శనివారం ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో 100 శాతం మేఘావృతమై ఉంది. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌కు ఐసీసీ షరతులలో ‘రిజర్వ్ డే’ అనే నిబంధన లేదు. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఈ పిచ్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 231 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేయడం ఇప్పటి వరకు రికార్డు. మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి.
టీమిండియా: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c&wk), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.
భారత జట్టు: రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, జేమ్స్ నీషమ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..