ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమ్ ఇండియా 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైంది. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ ఓటమి పాలైంది. లాథమ్ సెంచరీ చేయగా, విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.
ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు బ్యాట్స్‌మెన్ చక్కటి ఆటతీరును ప్రదర్శించారు. భారత ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించినా తర్వాత వేగంగా స్కోర్ చేసి మిడిల్ ఆర్డర్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. గిల్, ధావన్ ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. అతడితో పాటు శ్రేయాస్ అయ్యర్ 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ సులువుగా సాధించింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆరో బౌలర్ లేకపోవడం భారత బౌలింగ్ ఎటాక్‌లో స్పష్టంగా కనిపించింది. రెండో వన్డేలో శిఖర్ ధావన్ ఈ లోపాన్ని తీర్చాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ప్లేయింగ్-11లో మార్పు ఉండవచ్చు. పంత్, శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్లతో టీమ్ ఇండియా మొదటి వన్డేలో అడుగుపెట్టింది. ఇటువంటి పరిస్థితిలో బౌలింగ్ ఎంపిక కోసం టీమ్ మేనేజ్‌మెంట్ వారిలో ఒకరిని మినహాయించవచ్చిన తెలుస్తోంది.
దీపక్ హుడా బ్యాట్, బాల్ రెండింటిలో సహకారం అందించగల ఆటగాడు. అతని ఆఫ్ స్పిన్ జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అతను బ్యాట్‌తో కూడా బాగా ఆదుకోగలడు. వేగంగా పరుగులు కూడా చేయగలడు.
తొలి వన్డేలో యుజ్వేంద్ర చాహల్ చాలా ఖరీదైన ఆటగాడిగా మారాడు. 10 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చి వికెట్లు కూడా తీయలేకపోయాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. కుల్దీప్ చైనామన్ బౌలింగ్ ఆతిథ్య జట్టుకు సమస్యగా మారవచ్చు. అతని రాక బౌలింగ్ దాడిని కూడా మారుస్తుంది.
తొలి వన్డేలో గాయం కారణంగా జేమ్స్ నీషమ్‌ను దూరంగా ఉంచారు. మరి అతను ఫిట్‌గా ఉంటే ఆడే అవకాశం ఉంటుంది. ప్లేయింగ్-11లో చోటు దక్కించుకునేంత ఫిట్‌నెస్ సాధిస్తే న్యూజిలాండ్‌కు తలనొప్పి తప్పదు.
భారత్ – శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/సంజు శాంసన్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్
న్యూజిలాండ్ – కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..