
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది భారత్. గిల్ 2, రోహిత్ 15, కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కేఎల్ రాహుల్ 23, రవీంద్ర జడేజా 16 పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక బాగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్ తన షార్ట్ బాల్ వీక్‌నెస్‌కు మరోసారి బలయ్యాడు. 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులు చేసి విలియమ్ రూర్కీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివర్లో షమీ 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కుల్దీప్ ఒక రన్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా న్యూజిలాండ్ ముందు టీమిండియా 250 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. పిచ్ కండీషన్ దృష్ట్యా ఈ టార్గెట్ అంత ఈజీ కాకపోవచ్చు. డ్యూ లేకుంటే మాత్రం టీమిండియా స్పిన్ ఎటాక్‌ను తట్టుకొని కివీస్ బ్యాటర్లు నిలబడటంపైనే మ్యాచ్ ఫలితం ఆధార పడి ఉంది.
HARDIK PANDYA – THE MONSTER 🔥💪 pic.twitter.com/HtrkMmjWFT
— Johns. (@CricCrazyJohns) March 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.