IND VS NZ: టీమిండియాలో వీరిద్దరి సమయం ముగిసినట్టేనా.. కుర్రాళ్ల రాకతో కఠినమైన చోటు.. ద్రవిడ్‌ కూడా ఇక హ్యాండిచ్చేనా?

|

Nov 26, 2021 | 7:26 AM

India Vs New Zealand, 1st Test: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు కాన్పూర్‌లో జరుగుతోంది. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో రహానే, పుజారా బ్యాట్ మౌనంగానే ఉండిపోయింది. పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

IND VS NZ: టీమిండియాలో వీరిద్దరి సమయం ముగిసినట్టేనా.. కుర్రాళ్ల రాకతో కఠినమైన చోటు.. ద్రవిడ్‌ కూడా ఇక హ్యాండిచ్చేనా?
India Vs New Zealand Cheteshwar Pujara, Rahane
Follow us on

India Vs New Zealand, 1st Test: న్యూజిలాండ్‌లో ఫ్లాప్.. ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో ఫ్లాప్.. ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే వరుస.. అజింక్యా రహానే బ్యాటింగ్‌తో విఫలమవడం నిరంతరంగా మారింది. కాన్పూర్ టెస్టులోనూ అజింక్యా రహానే వరుసగా ఫ్లాప్ అవుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. శుభారంభం లభించినా ఆటలో 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మరోసారి విఫలమవడంతో అజింక్య రహానేకు క్రికెట్‌ నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాగా ప్రమాదకరం కాని బౌలర్ల దాడికి వ్యతిరేకంగా స్వదేశంలో రాణించలేకపోయాడని అంటున్నారు. రహానేకే కాదు పుజారాకు కూడా టీమిండియాలో చోటు కష్టంగా మారింది.

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పుజారా, రహానే ఇద్దరూ మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. ప్రతిభావంతులైన ట్రెంట్ బౌల్ట్‌ దాడికి వ్యతిరేకంగా ఇద్దరూ ముందుగానే ఔట్ అయ్యారు. ‘బనానా ఇన్‌స్వింగ్’ ను ఆడలేక పెవిలియన్ చేరారు. అయ్యర్ టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం, ఓపెనర్‌గా గిల్ పరుగులు చేయడం ఈ టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ (రహానే), వైస్ కెప్టెన్ (పుజారా)లకు ఖచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగిస్తాయనడంలో సందేహం లేదు.

దక్షిణాఫ్రికా టూర్‌లో రహానే-పుజారాకు చోటు దక్కుతుందా?
మరికొద్ది రోజుల్లోనే దక్షిణాఫ్రికా సిరీస్‌కి భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లను జోహన్నెస్‌బర్గ్‌కు ఎంపిక చేస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ రాహుల్ ద్రవిడ్ పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరి ఫాంను చూస్తే వీరిద్దరికి చోటు దక్కడం మాత్రం కష్టమేనని అనిపిస్తోంది.

శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ ప్లేయింగ్ XIలోకి వచ్చి, తన తొలి మ్యాచు‌లోనే ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయపడకపోతే, కాన్పూర్‌లో మిడిల్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్ కనిపించి ఉండేవాడు. దక్షిణాఫ్రికాలో మిడిలార్డర్‌లో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించవచ్చు. విదేశీ గడ్డపై గిల్ అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ స్కోరు నమోదుచేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. వెస్టిండీస్‌లో ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేసి 204 పరుగులు అందించాడు. అయ్యర్ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌తో చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. కాన్పూర్‌లో అతను సెంచరీ సాధిస్తే, దక్షిణాఫ్రికా టూర్‌లో సెలెక్టర్లు అతనిని ఎంపిక చేస్తారు. దక్షిణాఫ్రికా టూర్‌కు అంతా సిద్ధమైతే ఎవరిని పక్కన పెట్టనున్నారో చూడాలి.

Also Read: విరాట్, రవిశాస్త్రి వద్దన్నారు.. దక్షిణాఫ్రికా ఏపై సెంచరీ బాది సత్తా చాటాడు.. రాహుల్ ద్రవిడ్‌ అయినా ఆదరించేనా?

IPL 2022: వద్దంటోన్న ముంబై.. రారమ్మంటోన్న కొత్త టీం.. అన్నదమ్ములు చేరేది ఆ గూటికేనా? ఇషాన్‌, సూర్యకుమార్‌ల మధ్య తీవ్రమైన పోటీ..!