IND vs NZ: స్వదేశంలో తొలి WTC సిరీస్‌ ఆడనున్న భారత్.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

|

Nov 25, 2021 | 8:25 AM

India Vs New Zealand, 1st Test: రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తన మొదటి సిరీస్‌ను ఆడనుంది. తొలి టెస్ట్ ఛాంపియన్‌‌లో దెబ్బతీసిన న్యూజిలాండ్‌తోనే తేల్చుకునేందుకు సిద్ధమైంది.

IND vs NZ: స్వదేశంలో తొలి WTC సిరీస్‌ ఆడనున్న భారత్.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?
India Vs New Zealand 2021
Follow us on

India Vs New Zealand 2021: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో, రెండు జట్లు మరోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీని గుర్తుచేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ ఫైనల్లో కివీ జట్టు భారత్‌ను ఓడించి తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్ ప్రారంభమైంది. ప్రపంచ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ టీం భారత జట్టుపై టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో కివీ జట్టు మొదటి సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్ (WTC Points Table) స్థితి ఏమిటో తెలుకుందాం.

ఆగస్టులో భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లోని 5 టెస్టుల్లో 4 మాత్రమే జరిగాయి. కోవిడ్ కారణంగా ఐదవ మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జరగనుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు పాయింట్లు సాధించడంలో విజయవంతమయ్యాయి. భారత్‌, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మధ్య ఒకే ఒక్క సిరీస్‌ జరిగింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి ఖాతా తెరిచాయి.

మొదటి స్థానంలో భారత్..
టీమ్ ఇండియా రెండవ సిరీస్ ప్రారంభానికి ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పరిస్థితి చాలా ఫన్నీగా ఉంది. నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 26 పాయింట్లు చేరాయి. కానీ, ఈసారి పాయింట్లకు బదులుగా పాయింట్ల శాతం విధానాన్ని ఉపయోగిస్తున్నారు. తద్వారా భారతదేశం 54.17 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. 48 పాయింట్లలో 26 పాయింట్లను సాధించింది. మరోవైపు 50% ( 12 పాయింట్లు)తో పాకిస్థాన్, వెస్టిండీస్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో ఇంగ్లండ్ (14 పాయింట్లు) 29.17 శాతంతో ఉంది.

పాయింట్స్ సిస్టమ్‌లో మార్పులు..
గత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల విధానాన్ని మార్చిన ఐసీసీ ఈసారి ఒక్కో మ్యాచ్‌ విలువను 12 పాయింట్లకు తగ్గించింది. ఈ విధంగా, పాయింట్ల శాతం ప్రకారం ప్రతి జట్టుకు పాయింట్ల పంపిణీ జరగనుంది. గత ఛాంపియన్‌షిప్‌లో, ప్రతి సిరీస్‌కు 60 పాయింట్లు నిర్ణయించారు. దానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఈసారి కూడా అన్ని జట్లు 6 సిరీస్‌లను మాత్రమే ఆడనున్నాయి. ఇందులో 3 స్వదేశంలో 3 విదేశాల్లో ఆడాలి. టీం ఇండియా తన తొలి విదేశీ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో ఆడింది. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో మొదటి సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పూర్తి 24 పాయింట్లు సాధించడం ద్వారా టీమ్ ఇండియా మొదటి స్థానంలో తన ఆధిక్యాన్ని బలోపేతం చేసుకునే ఛాన్స్ ఉంది.

Also Read: Watch Video: అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా బౌలర్.. కోపంతో ఏం చేశాడో తెలుసా?

IND vs NZ: నాలుగేళ్ల కష్టం.. గాయాలు బాధించినా వెనక్కి తగ్గలే.. టెస్ట్ క్రికెటర్ నంబర్ 303‌గా బరిలోకి దిగనున్న ప్లేయర్ ఎవరో తెలుసా?