కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయాస్ అయ్యర్, రవింద్ర జడేజా ఉన్నారు. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ వచ్చారు. మయాంక్ అగర్వాల్ 28 బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లో కీపర్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 87 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా భోజన విరామ సమయానికి 82/1తో నిలిచింది.
భోజన విరామం అనంతరం 52 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానె, పుజారాతో కలిసి ఆచితూచి ఆడారు. జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద పుజారా సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాసేపటికే 35 పరుగులు చేసిన కెప్టెన్ రహానెను జెమీసన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
మూడో సెషన్లో శ్రేయాస్ అయ్యర్, రవింద్ర జడేజా కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. చెత్తు బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో శ్రేయాస్ తన తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆట ముగిసే ముందు రవింద్ర జడేజా కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడప. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 75 పరుగులు, రవింద్ర జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
Read Also.. IND vs NZ: పాత సంప్రదాయానికి వెల్‌కం చెప్పిన రాహుల్ ద్రవిడ్.. శ్రేయాస్‌కు కలిసొచ్చిన కేఎల్ రాహుల్ గాయం