IND vs IRE: అందరి ముందు పిల్లలు నిల్చున్నారు.. మరి వైభవ్ సూర్యవంశీ ముందు ఎందుకు లేరు? కారణం?

ఐర్లాండ్‌తో జరిగిన తొలి T20లో టీమిండియా ఓటమి పాలైనా, వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. జాతీయ గీతాలాపన సమయంలో ప్లేయర్లు పిల్లలతో వస్తారు, కానీ వైభవ్ ముందు ఎవరూ లేరు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

IND vs IRE: అందరి ముందు పిల్లలు నిల్చున్నారు.. మరి వైభవ్ సూర్యవంశీ ముందు ఎందుకు లేరు? కారణం?
Vaibhav Sooryavanshi

Updated on: Jun 27, 2026 | 11:54 AM

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రిజల్ట్‌తో క్రికెట్ అభిమానులంతా చాలా నిరాశ చెందారు. అయితే మ్యాచ్ కంటే ముందే ఓ విషయంపై మరింత డిజప్పాయింట్ అయ్యారు. అదేంటంటే.. వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఆడటం లేదని తెలిసి.. చాలా మంది మ్యాచ్ కూడా చూడలేదు. పైగా టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్ ఫలితం సంగతి పక్కనపెడితే.. వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన మరో విషయం వైరల్‌గా మారింది. అదేంటంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరుజట్లు తమ తమ జాతీయ గీతాలను గ్రౌండ్‌లో ఆలపించాయి.

జాతీయ గీతాలపన కోసం గ్రౌండ్‌లోకి వచ్చే ముందు ప్రతి ప్లేయర్ చిన్న పిల్లలతో ఎంట్రీ ఇచ్చారు. నేషనల్ యాంథమ్ ఆలపించే టైమ్‌లో ఆ పిల్లలు ఆటగాళ్ల ముందు నిల్చున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ ముందు మాత్రం ఎవరు లేరు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. వైభవ్ ముందు ఎందుకు పిల్లాడు కానీ, చిన్న పాప గానీ నిల్చోలేదు అని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే కారణం ఏమై ఉంటుందని కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని తెలుస్తోంది. కాగా, కొంతమంది నెటిజన్లు అతనే చిన్న పిల్లాడు.. మళ్లీ అతనికి ఎందుకు పిల్లాడు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

అసలు ఆటగాళ్లు పిల్లలతో ఎందుకు వస్తారు?

క్రికెట్‌లో మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాల సమయంలో ఆటగాళ్లు ఒక్కో చిన్నారితో కలిసి మైదానంలోకి రావడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. దీనిని ప్లేయర్ ఎస్కార్ట్ లేదా చైల్డ్ మస్కట్ కార్యక్రమం అని పిలుస్తారు.

    • క్రికెట్‌ను పిల్లలకు చేరువ చేయడం: చిన్నారుల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ అభిమాన ఆటగాడితో కలిసి మైదానంలో నడిచే అవకాశం వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది.
    • క్రీడాస్ఫూర్తి, స్నేహానికి ప్రతీక: పిల్లలు అమాయకత్వం, ఐక్యత, శాంతికి ప్రతీకగా భావిస్తారు. రెండు జట్లు పోటీ పడుతున్నప్పటికీ క్రీడాస్ఫూర్తి ముఖ్యమనే సందేశాన్ని ఇది ఇస్తుంది.
    • ఐసీసీ టోర్నమెంట్లలో ప్రత్యేక కార్యక్రమం: ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నమెంట్లలో స్థానిక పాఠశాలల నుంచి లేదా క్రికెట్ అకాడమీల నుంచి ఎంపిక చేసిన చిన్నారులను ఈ కార్యక్రమానికి తీసుకొస్తారు.
    • స్పాన్సర్లు, నిర్వాహకుల ప్రచార కార్యక్రమం: కొన్ని సందర్భాల్లో టోర్నమెంట్ స్పాన్సర్లు నిర్వహించే పోటీలు లేదా కార్యక్రమాల ద్వారా ఎంపికైన చిన్నారులకు ఈ అవకాశం లభిస్తుంది.
    • మరపురాని అనుభవం: ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి జాతీయ గీతం సమయంలో నిలబడటం, లక్షలాది మంది ప్రేక్షకుల ముందు మైదానంలో నడవడం చిన్నారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. వారిలో చాలామంది భవిష్యత్తులో ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎదగాలనే కలను పెంచుకుంటారు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us