
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 34 పరుగులు చేసింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ (9) రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
తొలి ఓవర్ నుంచే దూకుడైన ఆరంభం వచ్చినా.. అభిషేక్ శర్మ మాత్రం తన పేలవ ఫాంను కొనసాగించాడు. వరుస బౌండరీలు కొడుతూ ఫాంలో కనిపించిన అభిషేక్.. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు స్టేడియం చేరుకున్నాయి.
రిజర్వ్ డేలో సెమీఫైనల్ నిర్వహించలేకపోతే, నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే సూపర్ 8 దశలో గ్రూప్ 1లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది.
ముంబైలో వర్షం పడే అవకాశం లేదు. కానీ ఐసీసీ ముందుజాగ్రత్తగా రిజర్వ్ డేను కేటాయించింది. ఏదైనా కారణం చేత మార్చి 5న మ్యాచ్ పూర్తి చేయలేకపోతే, మార్చి 6వ తేదీ శుక్రవారం రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది.
వాంఖడేలో భారత్ ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఐదు గెలిచి, రెండు ఓడిపోయింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఇక్కడ ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడింది. మూడు గెలిచి, మూడు ఓడిపోయింది. ఈ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ రెండుసార్లు తలపడ్డాయి. రెండూ 1-1 తేడాతో గెలిచాయి.
ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మొదటి మూడు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఆ తర్వాత, ఛేజింగ్ జట్లు వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జింబాబ్వేను 107 పరుగుల తేడాతో ఓడించింది.
ఇక్కడ జరిగిన 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, ఛేజింగ్ చేసిన జట్లు ఎనిమిది సార్లు గెలిచాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఎనిమిది సార్లు గెలిచాయి. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 254. ఈ ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ చేసింది. ఇక్కడ 32 ఇన్నింగ్స్‌లలో ఆరుసార్లు 200 కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, 2025లో భారత్‌పై ఇంగ్లాండ్ 97 పరుగులకు ఆలౌట్ అయింది.
వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరుగాంచింది. వాతావరణం కూడా స్పష్టంగా ఉండటం వల్ల మంచు కురుస్తుంది. దీని వలన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
వాంఖడే వేదికగా నేడు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ తలపనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.
IND vs ENG, T20 WC Final Live Score: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నామంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇంగ్లాండ్ రెహాన్ అహ్మద్ స్థానంలో జామీ ఓవర్టన్‌ను చేర్చుకుంది.
సెమీఫైనల్లో ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి తలపడనున్నాయి. గతంలో ఇరుజట్లు 2022, 2024లో తలపడ్డాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు ఫైనల్‌ను కూడా గెలుచుకోవడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆరోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. గతంలో 2007, 2014, 2016, 2022, 2024లో భారత జట్టు టాప్ నాలుగు స్థానాల్లో నిలిచింది. ఐదు సెమీఫైనల్స్‌లో మూడింటిని గెలుచుకుంది.
ఇంగ్లాండ్ కూడా ఆరోసారి సెమీఫైనల్స్‌లో ఆడుతోంది. గతంలో ఇంగ్లాండ్ జట్టు 2010, 2016, 2021, 2022, 2024లో ఈ దశకు చేరుకుంది. మూడు సెమీఫైనల్స్‌లో విజయం సాధించడం ద్వారా ఫైనల్‌లో తమ స్థానాన్ని భద్రపరచుకుంది.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..