ఎడ్జ్‌బాస్టన్ రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో (12), స్టోక్స్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా, సిరాజ్, షమీ తలా ఓ వికెట్ తీశారు. టీమిండియా స్కోరుతో పోల్చుకుంటే ఇంగ్లండ్ 332 పరుగులు వెనకబడి ఉంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు రెండో రోజు జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌కు తొలి దెబ్బ తీశాడు. మూడో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ అలెక్స్ లీస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే సమయంలో రెండో రోజు రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున మూడో సెంచరీని పూర్తి చేశాడు.
తొలి రోజు భారత్ 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఒక దశలో భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు తొలి రోజు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఎడ్జ్‌బాస్టన్ రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో (12), స్టోక్స్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా, సిరాజ్, షమీ తలా ఓ వికెట్ తీశారు
ఇంగ్లండ్ ఐదో వికెట కోల్పోయింది. జాక్‌లీచ్ (0) పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో కీపర్‌కు దొరికిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 83/5.
నిలకడగా ఆడుతున్న రూట్ (31)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 78/4. నేటి ఆటలో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
రూట్, బెయిర్ స్టో నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా వికెట్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 76/3. నేటి ఆటలో ఇంకా 11 ఓవర్లు ఉన్నాయి.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ అప్డేట్ వచ్చింది. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ తిరిగి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం నిలిచిపోవడంతో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు స్కోరు 60/3. క్రీజులో రూట్ (19), బెయిర్ స్టో (6) ఉన్నారు. స్టోక్స్‌బృందం ఇంకా 356 పరుగులు వెనకబడి ఉంది.
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా సారథి బుమ్రా 3వ ఓవర్‌లోనే భారీ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ అలెక్స్ లీస్(6)ను బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో వర్షం అంతరాయంతో ఆగిపోయే ముందు ఇంగ్లండ్ 3 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు రెండో రోజు జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ రెండో రోజు రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో బుమ్రా బ్యాట్‌తో మ్యాచ్‌లో మంటలు పుట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ పాలిట బుమ్రా విలన్‌గా మారాడు. 84వ ఓవర్ వేసిన బ్రాడ్.. మొత్తం 35 పరుగులు సమర్పించుకున్నాడు.. ఇందులో బుమ్రా 4 ఫోర్లు, 2 సిక్సులు బాదేశాడు.
సెంచరీ చేసిన అనంతరం రవీంద్ర జడేజా(104) పరుగుల వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 82.2 ఓవర్లకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది.
మహ్మద్ షమీ(16) పరుగుల వద్ద బ్రాడ్ బౌలింగ్‌లో లీచ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 82 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది.
రెండో రోజు 338 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్.. జడేజా సెంచరీతో మరింత ఆధిపత్యం దిశగా భారత్ సాగుతోంది. ఈ సెంచరీతో జడేజా.. విదేశీ గడ్డపై తొలిసారి శతకాన్ని పూర్తి చేశాడు. 183 బంతుల్లో 13 ఫోర్లతో విదేశంలో తొలి సెంచరీని పూర్తి చేశాడు.
రిషబ్ పంత్ 146 పరుగులతో భారత జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించాడు. చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి లాంటి బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయలేని చోట పంత్ అలజడి రేపాడు. ఇంగ్లిష్ బౌలర్లను మానసికంగా ఇబ్బంది పెట్టి, పరుగులు రాబట్టాడు.
TV9 క్రికెట్ లైవ్ బ్లాగ్‌కి స్వాగతం. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. తొలి రోజు భారత్ 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.