భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టు ముగింపుపై ఉత్కంఠ నెలకొంది. వర్షం కారణంగా గురువారం సగం రోజు ఆట రద్దైన సంగతి తెలసిందే. శుక్రవారం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. నేడు మ్యాచ్ ముగిసేసమయానికి టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11.1 ఓవర్లలో 25/0 స్కోర్‌తో ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ 11, డామ్ సిబ్లీ 9 వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లతో పడొట్టారు.
మూడో రోజు ఆటలోనూ వర్షం అంతరాయం కలిగిస్తోంది. తొలుత మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే వర్షం కురవగా మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగానూ మరోసారి కురుస్తోంది. దాంతో ఇంగ్లాండ్ 11.1 ఓవర్లకు 25/0తో నిలిచింది. రోరీ బర్న్స్(11), డామ్ సిబ్లీ(9) పరుగులతో కొనసాగుతున్నారు.
ఇంగ్లాండ్ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లీడ్‌ను సంపాదించింది. ఈ క్రమంలోనే రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చారు.
టీ బ్రేక్ సమయానికి ఆరు ఓవర్లకు 11 పరుగులు చేసింది ఇంగ్లాండ్. రోరీ బర్న్స్ (1) , డామ్ సిబ్లీ (5) క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 84 పరుగుల ఆధిక్యంలో ఉంది.
☕️ on Day 3 of the 1st Test.
England 11/0, trail #TeamIndia (278) by 84 runs.
Scorecard – https://t.co/TrX6JMiei2 #ENGvIND pic.twitter.com/dzDFYd11OY
— BCCI (@BCCI) August 6, 2021
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. చివర్లో బుమ్రా(28) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 95 పరుగుల కీలక ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. మరోవైపు సిరాజ్(7) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్‌సన్ ఐదు, అండర్సన్ నాలుగు వికెట్లు తీశారు.
టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రాబిన్‌స్ వేసిన 80.3 ఓవర్‌కు షమి(13) బౌల్డయ్యాడు. దాంతో భారత్ 245 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (56) ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ తర్వాత వికెట్ చేజార్చుకున్నాడు. రాబిన్‌సన్ వేసిన 75వ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి దూకుడుమీదున్నాడు. ఈ క్రమంలోనే చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి స్టువర్ట్ బ్రాడ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 232 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజులో షమి(3), బుమ్రా ఉన్నారు.
టీమిండియా ఏడో వికెట్‌ను చేజార్చుకుంది. అండర్సన్ వేసిన 70.5 ఓవర్‌కు శార్ధూల్ ఠాకూర్(0) డకౌట్ అయ్యాడు. స్లిప్‌లో రూట్ క్యాచ్ అందుకోవడంతో భారత్ 207 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా(32), మహ్మద్ షమి ఉన్నారు.
మరోవైపు ఇంగ్లాండ్ పేసర్ ఈ వికెట్‌తో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్‌కుంబ్లే రికార్డును బద్దలుకొట్టాడు. ఇక టీమిండియా 69 ఓవర్లకు 205/6తో నిలిచింది. క్రీజులో జడేజా(32), శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. భారత్ ప్రస్తుతం 22 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్(84) ఔటయ్యాడు. అండర్సన్ వేసిన 68.5 ఓవర్‌కు వికెట్ల వెనుక కీపర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 205 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది.
1st Test. 68.5: WICKET! KL Rahul (84) is out, c Jos Buttler b James Anderson, 205/6 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 6, 2021
కెఎల్ రాహుల్‌కు లైఫ్‌లైన్ లభించింది. నిన్నటి నుండి ఎలాంటి తప్పు లేకుండా బాగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ మొదటి పెద్ద తప్పు చేసాడు. జేమ్స్ ఆండర్సన్ వేసిన బౌలింగ్‌లో ఆఫ్-స్టంప్ మీదుగా వెళ్తున్న బంతిని అతను థర్డ్‌మ్యాన్ వైపు ఆడాలని అనుకున్నాడు. కానీ బంతి ఊహించిన దాని కంటే ఎక్కువ బౌన్స్ కలిగి ఉంది, దీని కారణంగా బ్యాట్ చివరి అంచుకు తగిలి స్లిప్‌లో క్యాచ్ వెల్లింది. కానీ ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ దానిని పట్టుకున్నాడు. కానీ.. తప్పి పోయింది. రాహుల్ 78 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు టీమిండియా లీడ్‌లో వచ్చింది. ముందుగా ఇంగ్లాండ్ 183 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 66 ఓవర్లలో 191 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. KL రాహుల్(77) సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. రవీంద్ర జడేజా(27) చక్కటి సహకారం రాహుల్‌కు కలిసి వస్తోంది.
It is Lunch on Day 3 and #TeamIndia have added 66 runs in 19.2 overs with the loss of 1 wicket.
@klrahul11 is batting superbly on 77 with @imjadeja on 27.Scorecard – https://t.co/TrX6JMiei2 #ENGvIND pic.twitter.com/QUdUWyi5aZ
— BCCI (@BCCI) August 6, 2021
ఐదో వికెట్ పోవడంతో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు 97/1తో పటిష్టస్థితిలో నిలిచిన కోహ్లీసేన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో రోజు ఆట కూడా వరణుడి కారణంగా గంటపాటు ఆలస్యమైంది. అయితే, తర్వాత రిషభ్ పంత్(25) కూడా వెనుదిరగడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో జోడీ కట్టిన కేఎల్ రాహుల్(64), రవీంద్ర జడేజా (6) నిలకడగా ఆడుతున్నారు. దాంతో భారత్ 55 ఓవర్లకు 157/5తో నిలిచింది.
వర్షం నిలిచిపోవడంతో ఆట మొదలైన కాసేపటికే ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రిషభ్ పంత్(25) ఔటయ్యాడు. రాబిన్‌సన్ వేసిన 50వ ఓవర్‌లో వరుసగా ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదిన అతడు ఆఖరి బంతికి పెవిలియన్ చేరాడు. రిషభ్ ఆడిన షాట్‌ను బెయిర్‌స్టో క్యాచ్ అందుకోవడంతో భారత్ 145 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో KL రాహుల్(58), రవీంద్ర జడేజా ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 38 పరుగుల వెనుకంజలో ఉంది.
వర్షం కారణంగా ఆటలో 6 ఓవర్లు కోల్పోయింది. ఇప్పుడు 92 ఓవర్లు వేయాల్సి ఉంది. అలాగే, సెషన్ మళ్లీ మార్చబడింది. ఇప్పుడు మొదటి సెషన్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 కి బదులుగా సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అదే సమయంలో చివరి సెషన్ రాత్రి 11 గంటలకు బదులుగా 11.30 గంటలకు ముగుస్తుంది.
Updated session timings.
1205 – 1330 – 1st session
1330 – 1410 – ? break
1410 -1625 – 2nd session
1625 – 1645 – ? break
1645 – 1900 – 3rd session+30 minutes. We have lost 6 overs. 92 overs remaining #ENGvIND
— BCCI (@BCCI) August 6, 2021
మూడో రోజు ఆట ప్రారంభంలోనే వర్షం పడటంతో గంట పాటు ఆట ఆగిపోయింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం వర్షం నిలిచిపోవడంతో పాటు కాస్త వెలుతురు పెరిగింది. దీంతో అంపైర్లు ఆటను తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 49 ఓవర్లకు 133/4తో నిలిచింది. రాహుల్(58), పంత్(14) బ్యాటింగ్ చేస్తున్నారు.
నాటింగ్‌హామ్‌లో మళ్లీ తేలికపాటి వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా మ్యాచ్ 4.10 కి ప్రారంభం కాలేదు. ఇప్పుడు 4.35 వద్ద ఆటను మళ్లీ ప్రారంభించవచ్చు.
Play on Day 3 was halted due to rain after 11 balls. It has stopped raining currently, but is quite windy.
Restart at 11:40 local time (4:10PM IST) if no further rain. #ENGvIND
— BCCI (@BCCI) August 6, 2021
ఈ రోజు కూడా వర్షం అడ్డంకిగా మారుతోంది. ఆట మొదలైన కాసేపటికే వర్షం పడింది. దీంతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. వర్షం నిలిచిపోతే ఆటను మొదలు పెట్టే ఛాన్స్ ఉంది.
1st Test. 48.3: J Anderson to R Pant (13), 4 runs, 132/4 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 6, 2021
జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. భారీ షాట్ కొట్టాడు. ఈసారి ఎక్స్ట్రా కవర్ల గ్యాప్‌ని సద్వినియోగం చేసుకున్నాడు. పంత్‌కు ఇది రెండో బౌండరీ.