IND vs ENG 1st Test Highlights: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 21/0

|

Aug 05, 2021 | 12:16 AM

India vs England 1st Test Day 1: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

IND vs ENG 1st Test Highlights: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 21/0
Virat

5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ 9, రాహుల్‌ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు కుదేలైంది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్‌ జో రూట్‌(64) ఒక్కడే భారత బౌలర్లను కొద్దిగా ఎదుర్కొన్నాడు. బెయిర్‌ స్టో(29), క్రాలే (27), సామ్‌ కరన్‌(27) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు బుమ్రా, షమీ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, షమీ 3 వికెట్లు తీయగా, శార్దుల్‌ ఠాకూర్‌ 2, సిరాజ్‌ 1 వికెట్‌ పడగొట్టాడు.

ఇంగ్లాండ్​-ఇండియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్​కు తొలి అడుగు పడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత జరగుతున్న తొలి సిరీస్​ ఇదే కావడంతో టీమిండియా ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. భోజన విరామ సమయానికి కట్టు దిట్టమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌పై పట్టు సాధిస్తోంది. అయితే తాజాగా ఇంగ్లండ్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌ చివరి బంతికి 27 పరుగులు చేసిన క్రాలీ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఇంగ్లండ్‌ 42 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

అంతకముందు ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ ఐదో బంతికి బర్న్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.

ఈ సిరీస్​లో గెలిచి టీమిండియా డబ్ల్యూటీసీ-2లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలిని చూస్తోందా? లేక ఇంగ్లాండ్​ గడ్డపై తేలిపోతుందా? అనేది చూడాల్సి ఉంది. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​లో ఎవరికి వారు పోరాడుతున్నారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Aug 2021 10:18 PM (IST)

    183 పరుగులకే చేతులెత్తేసిన ఇంగ్లండ్

    తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో రూట్ ఒక్కడే 64 పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయలేక పెవిలియన్ చేరారు. బౌలర్లలో బూమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. షమీ 3, సిరాజ్ 1, శార్థుల్ 2వికెట్లు పడగొట్టారు.

  • 04 Aug 2021 09:57 PM (IST)

    మరింత కష్టాల్లో ఇంగ్లాండ్‌ జట్టు…

    ఇంగ్లాండ్‌ జట్టు మరింత కష్టాల్లో పడింది. ఫోర్‌ కొట్టి ఊపు మీద కనిపించిన బ్రాడ్‌ 4(3)ను  బుమ్రా ఎల్బీ రూపంలో ఔట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ జట్టు స్కోరు 160/9. క్రీజులోకి అండర్సన్‌ వచ్చాడు.


  • 04 Aug 2021 09:15 PM (IST)

    ఖాతా తెరవకుండానే బట్లర్‌ అవుట్..

    టీమిండియా పేస్‌ బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా బుమ్రా బౌలింగ్‌లో జాస్‌ బట్లర్‌ ఖాతా తెరవకుండానే ఇంటి ముఖం పట్టాడు. దీంతో ఇంగ్లండ్‌ 145 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.  ప్రస్తుతం ఇంగ్లండ్‌ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులె చేసింది. రూట్‌ 59, సామ్‌ కరన్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 51వ ఓవర్‌ రెండో బంతికి జానీ బెయిర్‌ స్టో అవుట్‌ కాగానే ఇంగ్లండ్‌ టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం షమీ వేసిన ఓవర్‌ చివరి బంతికి డానియెల్‌ లారెన్స్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కొల్పోయింది

  • 04 Aug 2021 09:05 PM (IST)

    తిప్పేసిన బుమ్రా.. బట్లర్‌ అవుట్..

    బుమ్రా వేసిన 55.5 ఓవర్‌కు బట్లర్‌(0) కీపర్‌ రిషభ్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.

  • 04 Aug 2021 09:04 PM (IST)

    లారెన్స్‌ వికెట్ పడింది…

    వికెట్లు కాపాడుకునేందుకు ముప్పు తిప్పలు పడుతోంది ఇంగ్లాండ్ జట్టు. తాజాగా షమీ వేసిన ఇన్నింగ్స్‌ 51 ఓవర్లో చివరి బంతికి లారెన్స్‌(0) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

  • 04 Aug 2021 08:29 PM (IST)

    బుమ్రా చేతిలో బెయిర్‌ స్టో ఎల్బీడబ్ల్యూ..

    మరో వికెట్ పెరిగింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌లో రెండో బంతికి సింగిల్ తీసి జో రూట్‌(51) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. షమీ వేసిన 51వ ఓవర్లో రెండో బంతికి బెయిర్‌ స్టో(29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీ విరామం తీసుకున్నారు.

  • 04 Aug 2021 07:46 PM (IST)

    వంద పరుగులు దాటని ఇంగ్లాండ్..

    జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో తొలి బంతికి జో రూట్‌( 35) బౌండరీ కొట్టగా.. అనంతరం శార్దూల్ ఠాకూర్‌ వేసిన ఓవర్‌లోనూ మరో ఫోర్‌ కొట్టాడు. జడ్డూ వేసిన 41వ ఓవర్లో తొలి బంతికి బెయిర్‌ స్టో (11) బౌండరీ బాదాడు. తర్వాతి బంతులకు పరుగులేమీ రాలేదు.

  • 04 Aug 2021 07:28 PM (IST)

    చెమటోడ్చుతున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు..

    టీమిండియా బౌలర్లు తిప్పేస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చెమటోస్తున్నారు. శార్దూల్ ఠాకూర్‌ 36వ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో కూడా ఒక పరుగు మాత్రమే వచ్చింది. అది కూడా నో బాల్‌ రూపంలో. ఠాకూర్‌ వేసిన 38వ ఓవర్లో రూట్‌(26) రెండు పరుగుల తీయగా..బెయిర్‌ స్టో(7) ఒక పరుగు చేశాడు.

  • 04 Aug 2021 07:08 PM (IST)

    సిరాజ్ ఖాతాలో మెడిన్ ఓవర్..

    ఇంగ్లాండ్‌ 83/3: టెస్ట్ మ్యాచ్‌లో మెడిన్ తీసుకోవడం పెద్ద విషయం. హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌ తన టాలెంట్ చూపిస్తున్నాడు.  సిరాజ్ వేసిన 33వ ఓవర్‌లో తొలి ఐదు బంతులకు పరుగులేమీ రాకపోగా.. చివరి బంతికి జో రూట్‌(23) ఫోర్‌ కొట్టాడు. షమీ వేసిన 34వ ఓవర్‌లో ఒకే పరుగు వచ్చింది. అనంతరం 35వ ఓవర్‌ను సిరాజ్‌ మెడిన్‌గా పూర్తిచేశాడు. బెయిర్‌ స్టో (7) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 04 Aug 2021 06:45 PM (IST)

    కొద్ది నిలకడగా..27 ఓవర్లు ముగిసేసమయానికి…

    భోజన విరామం తర్వాత ఇంగ్లాండ్ జట్టు కొద్ది నిలకడగా ఆడుతోంది. 27 ఓవర్లు ముగిసేసమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. డొమినిక్‌ సిబ్లీ 18, జో రూట్‌ 17 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్‌ తీశారు.

  • 04 Aug 2021 06:30 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్..

    28 ఓవర్ల్‌లో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. ఇంగ్లీష్ జట్టు మూడో వికెట్‌‌ను జారవిడుచుకుంది. షమీ వేసిన 28వ ఓవర్‌లో మూడో బంతికి డొమినిక్‌ సిబ్లీ(18) షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో కేఎల్‌ రాహుల్‌కు దొరికిపోయాడు. అంతకుముందు షమీ వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌లో ఒక పరుగు మాత్రమే లభించింది.

  • 04 Aug 2021 05:53 PM (IST)

    లంచ్ బ్రేక్ సమయానికి…

    లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ 61 పరుగులు చేసింది. డొమినిక్‌ సిబ్లీ (18), జో రూట్‌(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 04 Aug 2021 05:51 PM (IST)

    రూట్‌ వరుసగా మూడు ఫోర్లు

    జాక్‌ క్రాలే ఔటవ్వడంతో కెప్టెన్‌ జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్‌ వేసిన 22 ఓవర్‌లో తొలి బంతికి డొమినిక్‌ సిబ్లీ(18) ఫోర్‌ కొట్టగా.. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రూట్‌(12) వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అనంతరం శార్దూల్‌ వేసిన ఓవర్‌లో సిబ్లీ రెండు పరుగులు చేశాడు.

  • 04 Aug 2021 05:50 PM (IST)

    రెండో వికెట్ పడింది..

    అవుట్..! ఎడ్జ్డ్ కాట్! ఈసారి DRS టీమిండియాకు కలిసి వచ్చింది. కోహ్లీ ఇప్పుడు తనను తాను రిడీమ్ చేసుకున్నాడు. రిషబ్ పంత్‌ను అభినందించాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 21 ఓవర్లో చివరి బంతికి జాక్‌ క్రాలే (27) కీపర్‌ రిషభ్ పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు సిరాజ్‌ వేసిన 19వ ఓవర్‌లో పరుగులేమీ రాలేదు.   శార్దూల్ ఠాకూర్ వేసిన 20 ఓవర్‌లో జాక్‌ ఓ ఫోర్‌ కొట్టాడు.

  • 04 Aug 2021 04:58 PM (IST)

    మూడో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్..

    మూడో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ వేస్తున్నాడు. అతని తొలి బంతిని అద్భుతంగా వేశాడు. బంతి మంచి లెంగ్త్‌లో పడింది. క్రౌలీ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తూ క్రౌలీ బ్యాట్ చివరి అంచుని తగిలింది.

  • 04 Aug 2021 04:05 PM (IST)

    చాలా కాలం తర్వాత సందడిగా స్టేడియం..

    చాలా కాలం తర్వాత స్టేడియంలో అభిమానుల సందడి కనిపిస్తోంది. ఇరు జట్ల ఫ్యాన్స‌తో స్టేడియం కిక్కిరిసిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల అరుపులు, కేకలతో ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం పూర్తి స్థాయిలో నిండిపోయింది. చాలా మంది భారతీయ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు.

  • 04 Aug 2021 03:55 PM (IST)

    DRS తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది..

    ఈ సిరీస్‌లో మొదటి ఓవర్‌లోనే టీమిండియా అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో రోరీ బర్న్స్ LBW గా పెవిలియన్ దారి పట్టాడు. బుమ్రా వేసి తొలి ఓవర్‌లో ఐదవ బంతికి లెగ్-స్టంప్ లైన్ మీదుగా వచ్చిన బంతిని బర్న్స్ దానిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ డాడ్ చేస్తున్నప్పుడు అతని బ్యాట్ ప్యాడ్‌లను బంతి తాకింది. బుమ్రా చేసిన అప్పిల్‌తో అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో బర్న్స్ DRS తీసుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది.  

  • 04 Aug 2021 03:48 PM (IST)

    తొలి వికెట్ ఇలా..

    ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే బర్న్స్ వికెట్ కోల్పోయింది.

  • 04 Aug 2021 03:31 PM (IST)

    టాస్ గెలిచి…

    టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను బౌలింగ్‌కు దించింది…

     

  • 04 Aug 2021 03:28 PM (IST)

    బెన్​ స్టోక్స్​ వంటి ఆల్​రౌండర్ లేకపోవడం అతిపెద్ద లోటు..

    కెప్టెన్ రూట్​తో పాటు బెయిర్​ స్టో, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్​ ఆ జట్టుకు అదనపు బలం. తనదైన రోజున రోరీ బర్న్స్​, జోస్​ బట్లర్​ భారీ ఇన్నింగ్స్​లు ఆడగల సత్తా ఉన్నవారే. బెన్​ స్టోక్స్​ వంటి ఆల్​రౌండర్ లేకపోవడం ఇంగ్లాండ్​కు అతిపెద్ద లోటు. ఇటీవలే.. అతడు క్రికెట్​కు కాస్త విరామం ప్రకటించాడు.

  • 04 Aug 2021 03:27 PM (IST)

    ఇంగ్లాండ్ తుది జట్టు వీరే..

    ఇంగ్లాండ్ తుది జట్టు: రోరీ బర్న్స్, D సిబ్లే, Z క్రాలీ, J రూట్, J బెయిర్‌స్టో, D లారెన్స్, జోస్​ బట్లర్, కుర్రాన్, రాబిన్సన్, S బ్రాడ్, J ఆండర్సన్

  • 04 Aug 2021 03:25 PM (IST)

    టీమిండియా తుది జట్టు సభ్యులు వీరే…

    టీమిండియా తుది జట్టు: రోహిత్ శర్మ, KL రాహుల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, జడేజా, ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్

  • 04 Aug 2021 02:58 PM (IST)

    టీమిండియా సత్తా ఏంటో ఈ వీడియోలో చూడండి..

    మరికాసేపట్లో ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది.  మ్యాచ్ ప్రారంభంకు ముందు… ఈ బీసీసీఐ విడుదల చేసిన వీడియో ట్విట్ చూద్దాం…


     

Follow us on