IND vs ENG: నేటి నుంచే భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 పోరు.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

|

Jan 22, 2025 | 7:34 AM

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం (జనవరి 22) నుంచి ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కోల్ కతాలో జరగనుంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశముంది.

IND vs ENG: నేటి నుంచే భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 పోరు.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
India Vs England
Follow us on

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. బుధవారం (జనవరి 22) మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరగనుండగా, రెండో మ్యాచ్‌కి చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుండగా, నాలుగో మ్యాచ్ పుణెలో జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లుభారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. అంతకు ముందు 6.30 గంటలకు టాస్ పడనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, డిస్నీ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

దాదాపు 7 నెలల తర్వాత భారత్-ఇంగ్లండ్ రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇరు జట్లు చివరిసారిగా జూన్ 2024లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో తలపడ్డాయి. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి

ఈడెన్ గార్డెన్ లో రసవత్తర పోరు..

టీ 20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20 మ్యాచ్ – జనవరి 22, కోల్‌కతా
  • రెండో టీ20 మ్యాచ్ – జనవరి 25, చెన్నై
  • మూడో టీ20 మ్యాచ్ – జనవరి 28, రాజ్‌కోట్
  • నాలుగో టీ20 మ్యాచ్ – జనవరి 31, పూణె
  • ఐదవ T20 మ్యాచ్ – 2 ఫిబ్రవరి, ముంబై

టీ20 మ్యాచ్ ల కోసం ఇరు జట్లు:

భారత టీ20 జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

 

ఇంగ్లండ్ టీ20 జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ , ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

ప్రాక్టీస్ లో టీమిండియా క్రికెటర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..