India Vs England 1st T20: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు తడబాటుకు గురయ్యారు. మ్యాచ్ మొదలైన కాసేపటికే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు కేవలం రెండు పరుగులు ఉన్న సమయంలోనే కేఎల్ రాహుల్ జోఫ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సున్న పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ కేవలం 14 బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ప్లేయర్స్ కూడా పేలవ ప్రదర్శన చూపడంతో టీమిండియా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఒకానొక సమయంలో టీమిండియా వంద పరుగులు కూడా దాటుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలోనే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (67) అర్థసెంచరీతో రాణించడంతో జట్టు స్కోర్ పరుగులు పెట్టింది. ఇక టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయిన భారత్.. 124 పరుగులు మాత్రమే చేసింది. ప్రధానంగా బ్యాట్స్‌మెన్ వైఫ్యల్యం స్పష్టంగా కనిపించింది. మరి ఇక భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును ఎంతవరకు కట్టడి చేస్తారో చూడాలి.
ఓ క్రమంలో టీమిండియా వంద పరుగులోపే ఆలౌట్ అవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతోన్న తరుణంలో క్రీజులోకి వచ్చిన టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. టీ20ల్లో అయ్యర్‌కు ఇది 25వ హాప్ సెంచరీ కావడం విశేషం. హార్ధిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు.