
టీ20 ప్రపంచకప్‌లో బుధవారం బంగ్లాదేశ్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లోకి వచ్చి 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అనంరతం వర్షంతో సమీకరణాలు మారగా, బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:
నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(కీపర్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, సెమీస్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి సమీకరనాల తోడు లేకుండానే రోహిత్ సేన సెమీస్‌లో అడుగుపెట్టనుంది. చివరి ఓవర్ చివరి బంతి వరకు చేరిన ఈ మ్యాచ్ ఫలితం.. చాలా ఉత్కంఠగా సాగింది. చివరకు టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బంగ్లా టీం 102 పరుగుల వద్ద 5వ వికెట్‌ను కోల్పోయింది. హిట్టింగ్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. బంగ్లా విజయం సాధించాలంటే 21 బంతుల్లో 43 పరుగులు చేయాల్సి ఉంది.
12వ ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన అర్షదీప్.. అదే ఓవర్‌లో 5వ బంతికి మరో వికెట్ పడగొట్టాడు. బంగ్లా సారథి భారీ షాట్‌కు ప్రయత్నించి హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా టీం 100 పరుగుల వద్ద 4వ వికెట్‌ను కోల్పోయింది. బంగ్లా విజయం సాధించాలంటే 25 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది.
12వ ఓవర్ తొలి బంతికి అర్షదీప్ బంగ్లా బ్యాటర్ ఆఫిఫ్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో బంగ్లా టీం 99 పరుగుల వద్ద 3వ వికెట్‌ను కోల్పోయింది.
11 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది.
హిట్టింగ్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. శాంటో భారీ షాట్ ఆడే క్రమంలో 21 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ 41 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.
వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చేశారు. అయితే, ఆట మొదలైన వెంటనే బంగ్లాదేశ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. డేజంరస్ బ్యాటర్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
వర్షం ఆగిపోవడంతో మరలా మ్యాచ్ ఆడేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చేశారు. 54 బంతుల్లో 85 పరుగులు సాధించాలి.
7 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇంతలో భారీ వర్షం మొదలైంది. అయితే, ఓ స్ట్రాటజీతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పవర్ ప్లేలో భారీ స్కోర్ సాధించింది. దీంతో వర్షంతో మ్యాచ్ రిజల్ట్ డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చేరితే మాత్రం.. బంగ్లాదే విజయం కానుంది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల ముందుంది. ఇదే జరిగితే మాత్రం టీమిండియాకు సెమీస్ గండం నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది.
6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి 10 రన్ రేట్‌తో దూసుకపోతోంది. దాస్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం 30 పరుగులు చేసి 10 రన్ రేట్‌తో దూసుకపోతోంది. దాస్ కేవలం 11 బంతుల్లో 28 పరుగులు చేసి, భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధిస్తున్నాడు. నిజ్ముల్ 2 పరుగులు చేశాడు.
185 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బంగ్లా జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లుగా నజ్ముల్, లిట్టన్ దాస్ బరిలోకి దిగారు.
అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగలు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
19 ఓవర్ తొలి బంతికి అక్షర్ పటేల్ (7) రాంగ్ షాట్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో 18.1 ఓవర్లకు టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు పూర్తి చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు పూర్తి చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. హాసన్ మహమూద్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ 130 పరుగుల దగ్గర కోల్పోయింది.
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడబోయి.. షకిబుల్ హాసన్ బౌలింగ్ బౌల్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ 30 పరుగులకు పెవిలియన్ చేరాడు.
పేలవ ఫాంతో ఉన్న కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ పై సత్తా చాటాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బంతికే రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 9.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు పూర్తి చేసింది. కోహ్లీ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 1 వికెట్ కోల్పోయి 42 పరుగులు పూర్తి చేసింది. రాహుల్ 23, కోహ్లీ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా పరుగులు సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలో భారత్‌కు భారీ షాక్ తగిలింది. రోహిత్(2) మరోసారి విఫలమయ్యాడు. హసన్ మహ్మద్ బౌలింగ్‌లో యాసిర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా.. పరుగుల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో 2 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ 8, రాహుల్ 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఈ టీ20 ప్రపంచ కప్ 2022లో రోహిత్ తొలిసారి టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. భారీ టార్గెట్ పై కన్నేసింది. ఇక ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(కీపర్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్
భారత ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
ఈరోజు అడిలైడ్‌లో జరిగే మ్యాచ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్‌లకు చాలా ముఖ్యమైనది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
Match-day in Adelaide! ? ?#TeamIndia geared up for their 4⃣th match of the #T20WorldCup! ? ?#INDvBAN pic.twitter.com/FAcg4Y2zf6
— BCCI (@BCCI) November 2, 2022
ఈరోజు అడిలైడ్‌లో జరిగే మ్యాచ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్‌లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది సెమీ-ఫైనల్‌కు వెళ్లాలనే ఆశను బలపరుస్తుంది. అడిలైడ్ ఓవల్ మైదానంలో విరాట్ కోహ్లి భీకర ఫామ్‌కు ఇప్పటి వరకు 3 జట్లు బలయ్యాయి. నేడు బంగ్లాదేశ్ ఆ ఎపిసోడ్‌లో నాల్గవ జట్టు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విరాట్ రికార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్.. మూడో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆ తర్వాత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఇక మూడో మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించింది. దీంతో భారత్, బంగ్లాదేశ్ టీంలు 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం భారత్ ఆధిక్యంలో నిలిచింది.
అడిలైడ్ ఓవల్ మైదానంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈరోజు అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం ఆటను చెడగొడితే ఇరు జట్లూ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వర్షం కురవకూడదని, మ్యాచ్ పూర్తి కావాలని ఇరు జట్లూ కోరుకుంటున్నాయి. ఈరోజు అడిలైడ్ వాతావరణం ఎలా ఉంటుందో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు మూడో మ్యాచ్ ఆడనుంది. ఈరోజు అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. భారత్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఈరోజు ఎలాగైనా గెలవాల్సిందే.