India vs Australia Border – Gavaskar Trophy 2024: నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఈ ఐదు టెస్టు మ్యాచ్‌లు వరుసగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో గత రెండు టూర్‌లలో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. అందుకే, ఈసారి కూడా అదే విజయ పరంపర కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. వీటన్నింటితో పాటు, 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ 4-0తో ఆస్ట్రేలియాతో ఈ టెస్టు సిరీస్‌ను గెలవాల్సి ఉంటుంది. కాబట్టి, WTC ఫైనల్ దృష్ట్యా ఈ సిరీస్‌లో విజయం భారత్‌కు తప్పనిసరి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కింద భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 16 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ 10 టెస్టు సిరీస్‌లను గెలుచుకోగా, ఆస్ట్రేలియా 5 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. కేవలం 1 టెస్టు సిరీస్ మాత్రమే డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
భారత్ – ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 22 (శుక్రవారం) ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది.
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
‘డిస్నీ + హాట్‌స్టార్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ని మీరు వీక్షించవచ్చు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశదీప్, పర్దీష్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..