IND vs AUS 5th Test: సిడ్నీలోనూ తేలిపోయిన భారత బ్యాటర్లు.. 200లలోపే ఆలౌట్..

|

Jan 03, 2025 | 12:19 PM

India vs Australia, 5th Test Day 1 Score: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్‌ అయింది. చివరి సెషన్‌లో టీమిండియా 185 పరుగులకు ప్యాకప్ చెప్పేసింది. మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో 200లలోపే ఆలౌట్ అయింది.

IND vs AUS 5th Test: సిడ్నీలోనూ తేలిపోయిన భారత బ్యాటర్లు.. 200లలోపే ఆలౌట్..
Virat Kohli Out Ind Vs Aus
Follow us on

India vs Australia, 5th Test Day 1 Score: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్‌ అయింది. చివరి సెషన్‌లో టీమిండియా 185 పరుగులకు ప్యాకప్ చెప్పేసింది. మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో 200లలోపే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. 26 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు. నాథన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.

శుక్రవారం నాడు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అయితే, గాయం కారణంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. శుభ్‌మన్ గిల్ తిరిగి రాగా, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభించింది. గత ఎనిమిది టెస్టుల్లో ఏడోసారి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో తొలి 80 ఓవర్లలోనే ఆలౌటైంది. దీంతో భారత బ్యాటర్లు ఎంతలా ఆడుతున్నారో అద్దం పడుతోంది.

గత 30 సంవత్సరాలలో SCG టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్లు..

150 భారత్ vs ఆస్ట్రేలియా 2000

ఇవి కూడా చదవండి

127 ఆస్ట్రేలియా vs పాక్ 2010

191 భారత్ vs ఆస్ట్రేలియా 2012

185 భారత్ vs ఆస్ట్రేలియా 2025

సిడ్నీ టెస్టుకు ఇరు జట్లు..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి