IND vs AUS 3rd ODI: సిరీస్ డిసైడర్‌లో గెలుపెవరిదో.. ప్లేయింగ్ XIలో మార్పులు తప్పవా?

|

Mar 21, 2023 | 7:55 AM

India vs Australia: తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా జట్టు రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్‌లో మూడో వన్డే మార్చి 22న జరగనుంది.

IND vs AUS 3rd ODI: సిరీస్ డిసైడర్‌లో గెలుపెవరిదో.. ప్లేయింగ్ XIలో మార్పులు తప్పవా?
Ind Vs Aus
Follow us on

India vs Australia, 3rd ODI: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా పుంజుకుంది. 10 వికెట్ల తేడాతో సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

రెండో వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆస్ట్రేలియా జట్టు తరపున 5 వికెట్లు పడగొట్టగా, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ 36 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల పేలవ ప్రదర్శన కనిపించింది. భారత జట్టు 117 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత కంగారూ జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే సాధించింది.

పిచ్ రిపోర్ట్..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ ముఖ్యమైన మ్యాచ్ పిచ్ గురించి మాట్లాడితే, ఇక్కడ స్పిన్ బౌలర్లకు చాలా సహాయం అందనుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. తద్వారా పిచ్‌ను సరిగ్గా అంచనా వేసేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా – ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ (కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..