India vs Australia, 1st T20I: సందడే సందడి.. వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్.. భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధం..

|

Nov 22, 2023 | 1:41 PM

IND vs AUS 1st T20I: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య ఐదు మ్యాచ్ టీ20 సీరీస్ విశాఖపట్నంలో జరగనుంది. దీంతో వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్ నెలకొంది. భారత్‌, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ గురువారం జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్ లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి..

India vs Australia, 1st T20I: సందడే సందడి.. వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్.. భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధం..
Ind Vs Aus 1st T20i
Follow us on

IND vs AUS 1st T20I: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య ఐదు మ్యాచ్ టీ20 సీరీస్ విశాఖపట్నంలో జరగనుంది. దీంతో వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్ నెలకొంది. భారత్‌, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ గురువారం జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్ లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి.. స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పిటకే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్‌ విక్రయాలు జరిగాయి. ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి తర్వాత క్రికెట్‌ అభిమానులు చాలా డీలా పడ్డారు. ఇప్పటికీ ఆ ఫలితం నుంచి తేరుకోలేకపోతున్నారు.. అయినప్పటికీ కీలకమైన పోరు ముగిసిన తర్వాత జరుగుతున్న టీ-20 మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ టీ20 సిరీస్‌కు ఇండియా కెప్టెన్‌గా సూర్య కుమార్, ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ను స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం JioCinema యాప్‌లో కూడా చూడొచ్చు.

వీడియో చూడండి..

ఐదు మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..

  • 23 నవంబర్ – మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో
  • 26 నవంబర్ – రెండవ మ్యాచ్.. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
  • 28 నవంబర్ – మూడో మ్యాచ్ బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.
  • 01 డిసెంబర్ – నాల్గవ మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్‌పూర్.
  • 03 డిసెంబర్ – చివరి టీ20 మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. (హైదరాబాద్ లో జరగనుండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెంగళూరుకు మార్చారు.)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..