IND vs AFG: భారత్ వర్సెస్‌ అఫ్గాన్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుందా? ఢిల్లీ వాతావరణ నివేదిక ఇదే

ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

IND vs AFG: భారత్ వర్సెస్‌ అఫ్గాన్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుందా? ఢిల్లీ వాతావరణ నివేదిక ఇదే
India Vs Afghanistan

Updated on: Oct 11, 2023 | 11:09 AM

ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు ఢిల్లీ వాతావరణం ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వరల్డ్‌కప్‌లో టీమిండియా 2 వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అందువల్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే టీమ్ ఇండియా ప్రపంచకప్ రణరంగంలోకి దిగాల్సి వచ్చింది. వర్షం భయం ఉన్నా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగింది. ఇప్పుడు న్యూఢిల్లీ వేదికగా జరగనున్న టీమ్ ఇండియా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనేది అభిమానులు కోరుకుంటున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందే ఢిల్లీకి చెందిన క్రికెట్ అభిమానులకు ఓ సంతోషకరమైన వార్త అందింది. ఈరోజు ఢిల్లీలో మేఘావృతమై ఉంటుంది. అయితే వర్షాలు కురిసే అవకాశం లేదట. ప్రస్తుతం ఢిల్లీలో ఉదయం మేఘావృతమై ఉంది. రోజంతా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మేఘావృత వాతావరణం మ్యాచ్‌పై ప్రభావం చూపదని సమాచారం. అదే సమయంలో, ఢిల్లీలో వేడి వాతావరణం కూడా ఉంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులకు కూడా చెమటలు పట్టాల్సిందే.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీసులో చెమటోడుస్తోన్న టీమిండియా క్రికెటర్లు..

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్ :

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆఫ్ఘనిస్తాన్ :

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్.

హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు నేడు..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..