IND vs AFG: టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియాకు మరో ఓటమి తప్పదా.. ప్లేయింగ్ XI నుంచి రోహిత్ ఔట్.. కెప్టెన్ ఎవరంటే?
ఆసియా కప్‌లో సూపర్-4లో 2 మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇరు జట్లు ఫైనల్ రేసుకు దూరమయ్యాయి. నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలంటే భారత జట్టు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
India Vs Afghanistan Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మూడు మార్పులు చేసింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్‌లు లేరు. అదే సమయంలో, వారి స్థానంలో దీపక్ చాహర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ జట్టులో భాగమయ్యారు.
ఆసియా కప్‌లో సూపర్-4లో 2 మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇరు జట్లు ఫైనల్ రేసుకు దూరమయ్యాయి. నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలంటే భారత జట్టు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Afghanistan have won the toss and elect to bowl first against #TeamIndia
KL Rahul to Captain the team in the absence of Rohit Sharma.
Live – https://t.co/1UkuWxy3Ee #INDvAFG #AsiaCup2022 pic.twitter.com/cgeEN8nJxD
— BCCI (@BCCI) September 8, 2022
భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్ల ఫామ్ సరిగా లేకపోవడమే దీనికి అతిపెద్ద కారణం. భారత టాప్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించలేకపోయారు.
భారత్: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, ఆర్ అశ్విన్
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూకీ.