IND vs USA: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేద్దామని బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కట్‌చేస్తే.. కెరీర్‌లో మర్చిపోలేని బ్యాడ్ డే

Vaibhav Suryavanshi vs Virat Kohli Record: వర్షం తగ్గి ఆట త్వరగా ప్రారంభం కావాలని, భారత్ ఘనవిజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీకి ఇది మొదటి మ్యాచ్ కావడంతో, తదుపరి మ్యాచ్‌ల్లో అతను పుంజుకుని కోహ్లీ తరహాలో చెలరేగుతాడని ఆశిద్దాం.

IND vs USA: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేద్దామని బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కట్‌చేస్తే.. కెరీర్‌లో మర్చిపోలేని బ్యాడ్ డే
Vaibhav Suryavanshi

Updated on: Jan 15, 2026 | 6:19 PM

Vaibhav Suryavanshi vs Virat Kohli Record: అండర్-19 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఏలో భాగంగా భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టును భారత బౌలర్లు 107 పరుగులకే కుప్పకూల్చారు. అయితే, సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. భారత్ విజయానికి చేరువలో ఉన్న సమయంలో భారీ వర్షం పడటంతో ఆట తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ లోపే టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ రూపంలో బిగ్ షాక్ తగిలింది.

వైభవ్ సూర్యవంశీ వైఫల్యం – కోహ్లీ రికార్డు మిస్..

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. అతి పిన్న వయసులో అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడుతున్న వైభవ్, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు. అయితే, అమెరికా బౌలర్ ఋత్విక్ అప్పిడి వేసిన అద్భుతమైన బంతికి వైభవ్ కేవలం 2 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లీ నెలకొల్పిన చారిత్రాత్మక మార్కును చేరుకోవడంలో వైభవ్ విఫలమయ్యాడు.

భారత జట్టులో ఆందోళన..

స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ, వర్షం పడే సమయానికి భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఫలితం ఎలా ఉంటుందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌కు చాలా కీలకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..