IND vs SA: భారత జట్టు (IND) టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా (SA) పర్యటను వెళ్లింది. డిసెంబర్ 26 నుంచి ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా రకాలుగా ప్రత్యేకం కానుంది. కెప్టెన్సీ విషయంలో ఎన్నో వివాదాల తర్వాత టెస్టు సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది. గత 3 దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించేందుకు ప్రయత్నించనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో ఎన్నో అద్వితీయ రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
రాహుల్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా..?
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 11 మ్యాచ్‌లు ఆడి 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఆఫ్రికాలో ఐదు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ రాబోయే టెస్టు సిరీస్‌లో 66 పరుగులు చేసిన వెంటనే రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. కోహ్లీ 9 పరుగులు చేసిన వెంటనే వీవీఎస్ లక్ష్మణ్ 566 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ (1161) ఉన్నాడు.
జట్టును గెలిపించేందుకు కోచ్ ద్రవిడ్ చిట్కాలు..
ప్రస్తుతం, రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్నారు. దక్షిణాఫ్రికా టూర్‌ను గెలవడానికి ఆటగాళ్లకు ముఖ్యమైన చిట్కాలు ఇస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు బీసీసీఐ షేర్ చేసిన చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
IND vs SA: వికెట్ల రేసులో పోటీపడుతోన్న ఇద్దరు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో నిలిచేదెవరో?