భారత క్రికెట్ జట్టు 2022 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) సోమవారం ప్రకటించింది. భారత్‌తో సిరీస్‌తో పాటు, 2022లో నెదర్లాండ్స్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లతో ఆఫ్ఘనిస్తాన్ ఆడనుంది. ఈ సిరీస్‌లు స్వదేశీ, విదేశీ ప్రాతిపదికన షెడ్యూల్ ఖరారు చేశారు. వీటిలో ఆఫ్ఘనిస్తాన్ 18 మ్యాచ్‌లు స్వదేశంలో మిగతా మ్యాచ్‌లు విదేశాల్లో ఆడుతుంది. ఆసియా కప్ 2022, ICC T20 ప్రపంచ కప్ 2022, ఆసియా కప్ 2023 మరియు ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆఫ్ఘనిస్తాన్ ఆడనుంది.
ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో పాల్గొనడమే కాకుండా 18 స్వదేశీ, 34 విదేశీ మ్యాచ్‌లను ఆడుతుంది. “2022 నుండి 2023 వరకు ఆఫ్ఘనిస్తాన్ షెడ్యూల్‌లో చేర్చబడిన 52 మ్యాచ్‌లలో, 37 ODIలు, 12 T20Iలు మరియు 3 టెస్టులు ఉంటాయి. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 7 ODI సిరీస్‌లు ఆడనున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అలాగే ఆసియా కప్ 2022 (T20 ఫార్మాట్), ICC T20 ప్రపంచ కప్ 2022, ఆసియా కప్ 2023 (ODI ఫార్మాట్) & ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 వంటి నాలుగు ప్రధాన పరిమిత ఓవర్ల ఈవెంట్‌లలో పాల్గొంటుంది” అని ACB అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి-మార్చి 2023కి (ఇంకా ధృవీకరించాల్సి ఉంది) వాయిదా పడిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను రీషెడ్యూల్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క క్రికెట్ ఆపరేషన్స్ టీమ్‌తో పాటు ACB టాప్ మేనేజ్‌మెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.