IND vs IRE: బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా! పసికూన చేతిలో ఘోర పరాజయం

టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియాకు ఐర్లాండ్ చేతిలో తొలి టీ20లో షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ 182 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ సహా టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఈ అనూహ్య ఓటమి అభిమానులను నిరాశపరిచింది.

IND vs IRE: బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా! పసికూన చేతిలో ఘోర పరాజయం
Ind Vs Ire

Updated on: Jun 26, 2026 | 9:41 PM

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన టీమిండియాకు పసికూన ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి.. ఆరంభంలో వికెట్లు తీసుకున్నా.. తర్వాత ఐర్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొంటూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 182 పరుగులు చేశారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఐర్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తీశారు. ఓపెనర్ సంజూ శాంసన్ 5, ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యారు.

చివర్లో శివమ్ దూబే పోరాడినా.. ఫలితం లేకపోయింది. దూబే అవుట్ అయ్యాక టీమిండియా వికెట్లు టపటపా పడిపోయాయి. మొత్తంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయి.. 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి మద్ధతు లభించలేదు.

Follow Us