India Squad T20 World Cup 2022: T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఆడనుంది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత జట్టు అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెప్టెంబర్ 15న ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియాలో చాలా మంది యువ ఆటగాళ్లు కూడా అవకాశం పొందవచ్చని తెలుస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం, T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును సెప్టెంబర్ 15న ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు ముంబైలో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 28 నుంచి ఆసియా కప్‌లో పాల్గొననుంది. సెలక్షన్ కమిటీ చూపు కూడా ఈ టోర్నీపైనే ఉంటుంది. ఆసియా కప్‌లో చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆటగాళ్లను ప్రకటించేందుకు ఐసీసీ అన్ని జట్లకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఇచ్చింది. ఈ టోర్నమెంట్ కోసం జట్లు గరిష్టంగా 15 మంది ఆటగాళ్లను మాత్రమే చేర్చుకోగలవు. 23 మంది సభ్యులకు ఐసీసీ జట్లను అనుమతించింది. ఇందులో 15 మంది ఆటగాళ్లు, 8 మంది సహాయక సిబ్బంది ఉండవచ్చని తెలిపింది.
కాగా, అక్టోబర్ 23న భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబర్ 30న భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. టోర్నీ తొలి సెమీఫైనల్ నవంబర్ 9న జరగనుంది. కాగా రెండో సెమీఫైనల్ నవంబర్ 10న జరగనుంది. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.