Team India Squad: ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే..? కీలక అప్‌డేట్

|

Jan 09, 2025 | 6:54 AM

Team India Squad: భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ జనవరి 11న ముంబైలో సమావేశమై ఇంగ్లండ్‌తో జరిగే టీ20ఐ, వన్డే సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయవచ్చని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు జాబితాను పంపడానికి జనవరి 12 చివరి తేదీ కాబట్టి, గడువు కంటే ముందే BCCI జట్టును ప్రకటించవచ్చు.

Team India Squad: ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే..? కీలక అప్‌డేట్
Team India
Follow us on

Team India Squad: వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును జనవరి 11న ప్రకటించనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 11 లేదా జనవరి 12 నాటికి జట్టును ప్రకటించనున్నారు. జనవరి 11న ముంబయిలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ సమావేశమై, ఆపై జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

జనవరి 12 ఐసీసీ గడువు..

జనవరి 12లోగా అన్ని క్రికెట్ బోర్డులు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ప్రాథమిక జట్టులో మార్పులు చేయడానికి మొత్తం ఎనిమిది జట్లకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంది. అందుకే బీసీసీఐ జనవరి 12లోగా జట్టును కూడా ప్రకటించనుంది. నివేదికల ప్రకారం, బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పంపిన నోటీసులో జనవరి 11 న టి 20 సిరీస్ కోసం జట్టు ఎంపిక గురించి వివరాలు ఉన్నాయి. అయితే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఒకే రోజు ప్రకటించవచ్చు అని తెలుస్తోంది.

టీ20 జట్టులో ఎలాంటి మార్పు లేదు..

నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన చాలా మంది ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌కి ఎంపిక కావడం ఖాయం. అయితే, జైస్వాల్ వన్డేల్లో అరంగేట్రం చేస్తాడా లేదా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. జైస్వాల్ 2023లో భారత్ తరపున టెస్టు, టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటికీ, అతనికి ఇంకా వన్డేల్లో అవకాశం రాలేదు. వన్డే సిరీస్‌కు అర్హత సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

జట్టు ఎలా ఉంటుంది?

టెస్టు ఫార్మాట్‌లో పరుగులు రాబట్టలేక సతమతమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వన్డే జట్టులోకి ఎంపిక కావడం ఖాయం. అతనితో పాటు శుభ్‌మన్ గిల్‌కి కూడా జట్టులో చోటు దక్కనుంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లలో ఇద్దరిని వికెట్ కీపర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే సెలక్షన్ కమిటీ ముందున్న ప్రధాన ప్రశ్న స్టార్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీల ఫిట్‌నెస్.

బుమ్రా ఫిట్‌గా లేకుంటే షమీకి అవకాశం..

బుమ్రా గాయం ఎంత తీవ్రంగా ఉందో బట్టి అతను వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతాడా? అనేది తెలిసిపోతుంది. బుమ్రా ఫిట్‌గా లేకుంటే మహ్మద్ షమీని ఎంపిక చేయడం ఖాయం. ఎందుకంటే ఏడాదికి పైగా భారత జట్టుకు దూరమైన షమీ.. దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచి అతడి అనుభవంతో ఐసీసీ టోర్నీకి ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే సిరీస్‌లకు భారత ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా సిరాజ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్/మహమ్మద్ షమీ, రింకూ సింగ్/తిలక్ వర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..