BCCI: భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ అప్‌డేట్‌.. ఈ సిరీస్‌లో ఆటగాళ్లకి అది ఉండదట..!

|

Apr 26, 2022 | 7:59 AM

BCCI: ప్రస్తుతం టీమ్ ఇండియా ఆటగాళ్లు IPL 2022లో ఆడుతున్నారు. ఈ లీగ్ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఉంటుంది. పలువురు దక్షిణాఫ్రికా

BCCI: భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ అప్‌డేట్‌.. ఈ సిరీస్‌లో ఆటగాళ్లకి అది ఉండదట..!
India South Africa Series
Follow us on

BCCI: ప్రస్తుతం టీమ్ ఇండియా ఆటగాళ్లు IPL 2022లో ఆడుతున్నారు. ఈ లీగ్ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఉంటుంది. పలువురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. అయితే భారత్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌కి సంబంధించి ఒక అప్‌డేట్‌ వచ్చింది. బీసీసీఐ ఈ ప్లాన్‌ను అమలు చేస్తే భారత ఆటగాళ్ల ముఖాల్లో సంతోషం వెళ్లివిరుస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయం అధికారికంగా ధృవీకరించలేదు. బయో-బబుల్ అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. ప్రతి సిరీస్‌కి, ప్రతి టోర్నమెంట్‌కి బయోబబుల్ ఉంటుంది. ఇది క్రికెట్‌కి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ ప్లాన్ బయో బబుల్‌కి సంబంధించినది.

పిటిఐతో జరిగిన సంభాషణలో బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “అంతా సరిగ్గా జరిగితే దక్షిణాఫ్రికాతో ఆడే హోమ్ సిరీస్‌లో ఆటగాళ్లకు బయో-బబుల్, హార్డ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది” అని తెలిపారు. IPL 2022 సమయంలో కూడా ఆటగాళ్లు బయో-బబుల్‌లో భాగమే. ఈ పరిస్థితిలో మే 29 న లీగ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు మళ్లీ మరొక క్వారంటైన్‌లో నివసించాలని BCCI కోరుకోవడం లేదు.

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జూన్ 9 నుంచి 19 వరకు ఢిల్లీ, కటక్, వైజాగ్, రాజ్‌కోట్, బెంగళూరు నగరాల్లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉందని బీసీసీఐ అధికారి తెలిపారు. అతను ఇలా అన్నాడు.. “ఆటగాళ్ళు ఎక్కువసేపు బబుల్‌లో ఉండడం ఎంత కష్టమో బోర్డుకు తెలుసు. ఇది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.” అయితే ఇంగ్లండ్‌లోని ఏ క్రీడా ఈవెంట్‌లోనూ ఇకపై బయో బబుల్ ఉండదు. ఈ పరిస్థితిలో అక్కడికి చేరుకున్న తర్వాత భారత జట్టుకు బయోబబుల్‌ నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టుతో పాటు 6 మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ ఆడాల్సి ఉంది. జులైలో భారత్‌ ఇంగ్లండ్‌ పర్యటన జరగనుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

Pakistan Bowler: ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించిన పాకిస్తాన్‌ బౌలర్.. ఆ ఎఫెక్ట్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడికి తగిలింది..!

IPL 2022: 39 బంతుల్లో 6 సిక్సర్లు 7 ఫోర్లు.. కానీ ఈ 36 ఏళ్ల ఆటగాడి శ్రమ వృథా..!

ఈ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు.. ఈ పత్రాలుంటే చాలు..!