Ind vs Aus: పెర్త్‌లో టీమిండియా ప్రాక్టీస్..అడ్డుగా పరదా..వారికి చిక్కకుండా ఉండేందుకేనా?

నవంబర్ 22 నుంచి పెర్త్ టెస్టు ప్రారంభం కానుండగా, టీమ్ ఇండియా కూడా అందుకు సన్నాహాలు ప్రారంభించింది. భారత క్రికెట్ జట్టు తన ప్రాక్టీస్ సెషన్‌ను ఎవరికి కనబడకుండా ఉండేందుకు పరదాను అడ్డుగా పెట్టింది. ఎందుకో తెలుసా?

Ind vs Aus: పెర్త్‌లో టీమిండియా ప్రాక్టీస్..అడ్డుగా పరదా..వారికి చిక్కకుండా ఉండేందుకేనా?
India Practice Session Waca Nets Are Covered From Public View
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 12, 2024 | 4:50 PM

నవంబర్ 22 నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, అందుకు భారత జట్టు సన్నాహాలు ప్రారంభించింది. మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. అది కూడా వారు రహస్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సోమవారం ఆస్ట్రేలియా చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్ చేసినా సన్నాహకాలు జరుగుతున్న చోట  ఓ నల్లటి పరదాను ఏర్పాటు చేశారు.పెర్త్‌లోని ఒక అకాడమీలో టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే దాని సమీపంలోనే రహదారి ఉంది. దీంతో అక్కడి నుండి చూస్తే ప్రతిదీ కనిపిస్తుంది.  అకాడమీ సరిహద్దును నల్ల గుడ్డతో కప్పినట్లు ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రచురించింది. ఇప్పుడు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌పై ఎవరూ కన్ను వేయలేరు. ఆస్ట్రేలియన్ మీడియాను తప్పించుకునేందుకే  టీమిండియా ఇలా చేసి ఉండవచ్చు అని తెలుస్తుంది.

ఆస్ట్రేలియా మీడియా దృష్టి టీమ్ ఇండియాపైనే ఉంది. సహజంగానే ఆ మీడియా ప్రతి క్రీడాకారుడి బలాలు మరియు బలహీనతలపై కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్లు టీమ్ ఇండియా నెట్ సెషన్‌లను మరియు దాని సన్నాహాలను కూడా నిశితంగా పరిశీలిస్తారు. ఇది ఆస్ట్రేలియా జట్టుకు ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. దీనిని నివారించేందుకే టీమ్ ఇండియా ఈ చర్యను చేపట్టినట్లు ఓ వాదన వినిపిస్తుంది. అయితే 2022లో టీమ్ ఇండియా డబ్ల్యూఏసీఏ మైదానానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగిందని ఆస్ట్రేలియా జర్నలిస్టులు పేర్కొంటున్నారు. టీ20 ప్రపంచకప్‌ సమయంలోనూ టీమ్‌ ఇండియా ప్రాక్టీస్‌కు ముందు బౌండరీ గోడను పరదాతో కప్పేసింది.

టీమ్ ఇండియా ఎంత దాచినా.. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. ఒక వీడియోలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. పంత్ చాలా షాట్లు ఆడాడు. యశస్వి జైస్వాల్ కూడా షాట్లు ఆడుతూ కనిపించాడు. ఆటగాళ్లిద్దరూ దూకుడుగా షాట్లు ఆడుతూ కనిపించారు. యశస్వి జైస్వాల్ ఒక బంతిని అకాడమీ వెలుపలకు కూడా పంపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి