IND vs SA 2nd Test: రెండో టెస్ట్‌లో కీలక మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు.. జట్టులోకి టీమిండియా నయా సెన్సెషన్..

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఇప్పుడు 2వ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ . ఎందుకంటే 2 మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టెస్ట్‌లో మార్పులు రావడం ఖాయమైంది. ఇద్దరు ఆటగాళ్లకు మొండిచేయి చూపించనున్నారు.

IND vs SA 2nd Test: రెండో టెస్ట్‌లో కీలక మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు.. జట్టులోకి టీమిండియా నయా సెన్సెషన్..
Indian Cricket Team

Updated on: Dec 30, 2023 | 12:59 PM

Team India Playing 11 vs South Africa 2nd Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఇప్పుడు 2వ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ . ఎందుకంటే 2 మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అలాగే, తొలి మ్యాచ్‌లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన కర్ణాటక స్పీడ్‌స్టర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లు వేసినా ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్ మాత్రమే దక్కింది. అతను 93 పరుగులు ఇచ్చాడు. అందువల్ల రెండో టెస్టులో ప్రసిద్ధ్‌కు చోటు దక్కడం అనుమానమే.

ఇక్కడ, ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా ముఖేష్ కుమార్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కవచ్చు. ఈ రెండు మార్పులతో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న 2వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆడే అవకాశం ఉంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..