
South Africa vs India 2nd T20I: ఈరోజు (నవంబర్ 10) భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గెబహా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే, తొలి మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందడంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జట్టును బరిలోకి దింగనుంది. అయితే, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ నిరంతర వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. అయితే రీప్లేస్ మెంట్ ఓపెనర్ జట్టులో లేకపోవడంతో అభిషేక్‌కు మరో అవకాశం దక్కుతుందనడంలో సందేహం లేదు.
దీని ప్రకారం రెండో మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు టీమిండియాకు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. మూడో ఆర్డర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కనిపించనున్నాడు. అలాగే, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో, రింకూ సింగ్ ఆరో స్థానంలో నిలిచారు. అలాగే అక్షర్ పటేల్‌కు ఏడో నంబర్‌లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా అవకాశం లభించనుంది.
జట్టులో బౌలర్లుగా అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ ఉన్నారు. దీని ప్రకారం, టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
అభిషేక్ శర్మ
సంజు శాంసన్ (వికెట్ కీపర్)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా
రింకూ సింగ్
అక్షర్ పటేల్
అర్ష్దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి
రవి బిష్ణోయ్
అవేష్ ఖాన్
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ , విజయకుమార్ వైశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..