IND vs PAK: ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకుంటే.. బీసీసీఐపై బెదిరింపుల వర్షం.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్..

|

Nov 26, 2022 | 3:05 PM

Ramiz Raja: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా షాకింగ్ ప్రకటన చేశాడు. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు రాకపోతే భారత్ చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.

IND vs PAK: ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకుంటే.. బీసీసీఐపై బెదిరింపుల వర్షం.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్..
India Vs Pakistan
Follow us on

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా మరోసారి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రకటనపై స్పందిస్తూ.. టీమిండియా ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు రాకపోతే మనం కూడా ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లబోమని చెప్పుకొచ్చాడు. ఇదే జరిగితే ఈసారి ప్రపంచకప్ పాకిస్తాన్ లేకుండానే ఆడాల్సి వస్తుందని రమీజ్ రాజా పేర్కొన్నాడు. ఈ ప్రకటన తర్వాత రమీజ్ రాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా 2012 తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. దీంతో పాటు దాదాపు 14 ఏళ్లుగా భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఆసియా కప్ ఆడేందుకు టీమ్ ఇండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌కు చేరుకుంది. ఆ తర్వాత భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లలేదు.

ఆసియా కప్ 2023 పాకిస్తాన్‌లోనే..

వచ్చే ఏడాది ఆసియా కప్‌నకు పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ సందర్భంగా జై షా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లదని ప్రకటించిన సంగతి తెలిసిందే. జై షా చేసిన ఈ ప్రకటన పాకిస్థాన్‌కు మింగుడు పడలేదు. ఆయన ప్రకటనపై పీసీబీ స్పందిస్తూ బెదిరింపులతో కూడిన ప్రకటన చేసింది. ఆజ్ తక్‌లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం రమీజ్ రాజా మాట్లాడుతూ “భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ రాకపోతే, మేం లేకుండా ప్రపంచ కప్ ఆడవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. మేం మా దూకుడు వైఖరిని కొనసాగిస్తాం అంటూ ముగించాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన ఇరుజట్లు..

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ టోర్నీలో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. అయినప్పటికీ, ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..