IND vs NZ: టీమిండియా చెత్త రికార్డుపై ట్రోల్స్.. ఇక ఆ ఇద్దరు టెస్టుల్లోనూ రిటైరైతే బెటర్..

|

Oct 17, 2024 | 3:57 PM

చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IND vs NZ: టీమిండియా చెత్త రికార్డుపై ట్రోల్స్.. ఇక ఆ ఇద్దరు టెస్టుల్లోనూ రిటైరైతే బెటర్..
Netizens Trolls Virat Kohli
Follow us on

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఇది టెస్ట్ క్రికెట్‌లో సొంతగడ్డపై టీమిండియా అత్యంత చెత్త స్కోరు చేసింది. టీమిండియా ఆల్ టైమ్‌లో ఇదే మూడవ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. టాస్ గెలిచిన రోహిత్ సేన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పంత్ (20), జైస్వాల్(13) ఇద్దరే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఏమి ఆడకపోవడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. ఐదుగురు బ్యాటర్లు డకైట్ కావడం ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేసింది.

కివీ బౌలర్లు సత్తాచాటారు. మాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. విలియం ఓ’రూర్క్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టి తన స్వదేశీ టెస్టులో అరంగేట్రం చేశాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్టులో 36 పరుగులతో భారత్‌కు అంతకుముందు అత్యల్ప చెత్త రికార్డు స్కోరు ఉంది. 1952లో ఇంగ్లండ్‌పై చివరిసారిగా స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టాప్ ఏడుగురు భారతీయ బ్యాటింగ్ ఆర్డర్‌లో నలుగురు స్కోరు లేకుండా ఔట్ కావడం ఇదే తొలిసారి. తాజాగా టీమిండియా ఆటపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో వారిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. బౌలింగ్ పిచ్‌లో బ్యాటింగ్ తీసుకొవడం ఏంటని, ఎక్స్‌పెరీమెంట్స్ ప్రతిసారి పనిచేయవద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీ20లకు రోహిత్, విరాట్ రిటైర్ అయ్యారు, ఇక టెస్ట్‌లకు కూడా రిటైర్ అయి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి