Women’s World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా రెండో పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత కరేబియన్ జట్టుపై ఘన విజయం సాధించిన మిథాలీ సేన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (INDW vs ENGW) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన అత్యధికంగా 35 పరుగులు చేసింది. రిచా ఘోష్ 33 పరుగులు చేసింది. ఝులన్ గోస్వామి 20 పరుగులు చేసింది. యాస్తికా భాటియా, మిథాలీ రాజ్, దీప్తి శర్మ, స్నేహ రానా పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షార్లెట్ డీన్ 4 వికెట్లతో భారత పతానాన్ని శాసించగా.. అన్యష్రబ్ సోలే2, సోఫీ, కేట్ క్రాస్ ఒక్కొక్క వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. మేఘనా సింగ్ 3, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి, పూజ వస్త్రాకర్ తలో వికెట్ తీశారు.
హ్యాట్రిక్ ఓటముల తర్వాత..
కాగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసిన ఇంగ్లాండ్ మహిళల ప్రపంచకప్ 2022లో తొలి విజయాన్ని సాధించింది. అదే సమయంలో భారత్ 4 మ్యాచ్‌ల్లో రెండో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇక పాయింట్ల విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో మూడో స్థానంలో నిలిచింది టీమిండియా. ఇన్నే విజయాలు సాధించిన కివీస్ నెట్ రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది. ఇ మ్యాచ్ విషయానికొస్తే.. మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే నాలుగో ఓవర్లోనే యాస్తికా భాటియా(8) పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం 5 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే సాధించి నిష్ర్కమించింది. ఆతర్వాత దీప్తి శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన కొద్ది సేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా భారీస్కోరును అందించలేకపోయారు. షార్లెట్ వీరిని ఔట్ చేసి పెద్ద దెబ్బ కొట్టింది. స్నేహ రాణా కూడా డకౌట్ కావడంతో టీమిండియా వందలోపే చాపచుట్టేస్తుందని భావించారు. అయితే రీటా ఘోష్ 33, ఝులన్ 20 పరుగులు చేయడంతో 134 పరుగుల స్కోరు సాధించింది.
Also Read: Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!
Cucumber Side Effects: మంచిదని దొసకాయలు తెగ తింటున్నారా ? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకొండి..