Gautam Gambhir: భారత జట్టులో ఆ లోటు ఉంది.. దాన్ని ఎలా భర్తీ చేయాలో చెప్పిన గౌతమ్ గౌంభీర్..

|

Jan 31, 2022 | 7:17 PM

భారత్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతకాలని మాజీ క్రికెటర్‌ గౌతం గౌంభీర్ అన్నారు. వారిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావడానికి ముందు దేశీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దాలన్నారు...

Gautam Gambhir: భారత జట్టులో ఆ లోటు ఉంది.. దాన్ని ఎలా భర్తీ చేయాలో చెప్పిన గౌతమ్ గౌంభీర్..
Gambir
Follow us on

భారత్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతకాలని మాజీ క్రికెటర్‌ గౌతం గౌంభీర్ అన్నారు. వారిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావడానికి ముందు దేశీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దాలన్నారు. హార్దిక్ పాండ్యా గత మూడేళ్లుగా గాయాలతో పోరాడుతున్నాడు. అతడి స్థానంలో పరిమిత ఓవర్లు, టెస్ట్ క్రికెట్‌లో అనేక మంది ఆటగాళ్లను భారత్ ప్రయత్నించింది. అంతర్జాతీయ వేదికలపై ఆ పని చేయకుండా దేశవాళీ స్థాయిలోనే భారత్ ఆటగాళ్లను తీర్చిదిద్దాలని గంభీర్ అన్నాడు.

దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్‌గా ఆడాడు. అయితే, అతను మొదటి మ్యాచ్‌లో అస్సలు బౌలింగ్ చేయలేదు. మూడో మ్యాచ్‌కు అతన్ని తీసుకోలేదు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే జట్టుకు కూడా అతను ఎంపిక కాలేదు. ఆటగాడు ఎంపికైన తర్వాత అతనికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని గంభీర్ చెప్పాడు. “రంజీ ట్రోఫీలో వ్యక్తులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. వారు సిద్ధమైన తర్వాత వారిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురండి.” అని అన్నాడు. విజయ్ శంకర్, శివమ్ దూబే, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ వంటి చాలా మంది కుర్రాళ్లతో మేము దానిని చూశాము. మేము ముందుకు సాగాలి” అని గంభీర్ అన్నాడు.

Read Also.. Shoaib Akhtar: భారత్ టెస్ట్‌ల్లో ఎందుకు గెలుస్తుందో తెలుసా.. కారణం చెప్పిన పాకిస్తాన్ మాజీ బౌలర్..