AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్‌ని కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారు? ఇదిగో ఆ 15 కారణాలు మీకోసం..

Virat Kohli Records: ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు నిండాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు చాలా మంది క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌లో తమ సత్తా చాటుతున్నారు. కానీ కింగ్ కోహ్లీ లాంటి వారు ఎవరూ లేరు. అతని పుట్టినరోజున, కోహ్లీని కింగ్‌లా మార్చిన ఆ 15 రికార్డులను తెలుసుకుందాం..

Virat Kohli: విరాట్‌ని కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారు? ఇదిగో ఆ 15 కారణాలు మీకోసం..
India Vs South Africa, Virat Kohli
Venkata Chari
|

Updated on: Nov 05, 2023 | 1:03 PM

Share

విరాట్ కోహ్లీ.. ఈ పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం అని ఏ బౌలర్‌ను అడిగినా, ఖచ్చితంగా సమాధానం విరాట్ కోహ్లీ అనే వస్తుంది. స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా.. వారిని కూడా తన ఆటతో వెనక్కునెట్టేశాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఒకే ఒక రాజు ఉన్నాడు.. అది విరాట్ కోహ్లీ. ఈరోజు, నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా, ఈ ఆటగాడిని కింగ్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

15 విషయాల్లో నంబర్ 1గా విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఆగస్టు 18, 2008న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అంటే, అప్పటికి విరాట్ వయసు కేవలం 20 ఏళ్లు. విరాట్ తన మొదటి మ్యాచ్ ఆడినప్పుడు, ఈ ఆటగాడు సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాడి రికార్డులను బద్దలు కొట్టడానికి దగ్గరగా వస్తాడని ఎవరూ అనుకోలేదు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి, అతను 15 రికార్డుల్లో నంబర్ 1 అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

అరంగేట్రం తర్వాత విరాట్ కోహ్లీ పేరిట నమోదైన 15 పెద్ద రికార్డులు..

అత్యధిక పరుగులు – 26,209

అత్యధిక డబుల్ సెంచరీలు – 7

అత్యధిక సెంచరీ-78

అత్యధిక అర్ధ సెంచరీలు-136

అత్యధిక ODI పరుగులు-13525

అత్యధిక ODI సెంచరీలు – 48

అత్యధిక T20 పరుగులు – 4008

ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు – 1171

ICC ట్రోఫీలో అత్యధిక పరుగులు – 3142

ICC నాకౌట్‌లో అత్యధిక పరుగులు – 656

అత్యధిక పరుగులు (ఐసీసీ ఫైనల్స్) – 280

దశాబ్దపు అత్యుత్తమ వన్డే ఆటగాడు – విరాట్

దశాబ్దపు అత్యుత్తమ పురుషుల క్రికెటర్ – విరాట్ కోహ్లీ

అత్యధిక ICC అవార్డులు – 9

అత్యధిక టెస్టులు గెలిచిన భారత కెప్టెన్ – విరాట్ కోహ్లీ.

విరాట్ కోహ్లీ అద్భుతం..

గత 15 ఏళ్లలో క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ తన సత్తాను చాటుతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. అందుకే అతన్ని సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతుంటారు. ఇప్పుడు తన 35వ పుట్టినరోజు సందర్భంగా విరాట్ కోహ్లీపై అభిమానులకు రెండు అంచనాలు ఉన్నాయి. ముందుగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును బద్దలు కొట్టాలి. ఆ తర్వాత ఈ ఆటగాళ్లు భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మారుస్తారని అంతా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..