40 ఏళ్లకు టీమిండియాలోకి ఎంట్రీ.. ఆడింది 2 మ్యాచ్‌లే.. ఇంటి నుంచి బయల్దేరి, కనిపించకుండా పోయిన బ్యాట్స్‌మెన్..

|

Jun 16, 2022 | 5:01 PM

ఈ క్రికెటర్ 1922లో భారతదేశం తరపున డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఇద్దరు టెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.

40 ఏళ్లకు టీమిండియాలోకి ఎంట్రీ.. ఆడింది 2 మ్యాచ్‌లే.. ఇంటి నుంచి బయల్దేరి, కనిపించకుండా పోయిన బ్యాట్స్‌మెన్..
India Vs England
Follow us on

భారత బ్యాట్స్‌మెన్ అదృశ్యం అయ్యాడు. ఈ వార్త అప్పట్లో ఓ సంచలనంగా మారింది. తన సొంత ఇంటి నుంచి ఈ క్రికెటర్ అదృశ్యం కావడం భారత క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. నివేదికల ప్రకారం, అతను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఉదయాన్నే తన ఇంటి నుంచి బయలుదేరాడంట. ఆ తర్వాత అతను ఎప్పటికీ తిరిగి రాలేదు. ఈ రోజున అంటే జూన్ 16 ఆ భారత బ్యాట్స్‌మెన్ పుట్టినరోజు కూడా. భారత క్రికెట్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ కోటార్ రామస్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1896 జూన్ 16న జన్మించిన కోటార్ రామస్వామి బుచ్చిబాబు నాయుడు కుమారుడు. దక్షిణ భారత క్రికెట్ పితామహుడిగా పేరుగాంచాడు. కోటూరు రామస్వామి 1985 అక్టోబరు 15న ఉదయం తన మద్రాసు ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ, ఆ తర్వాత తిరిగి రాలేదని చెబుతారు. అలాగే అతని మృతదేహం కూడా కనబడలేదు.

రామస్వామి 55 మ్యాచ్‌ల్లో 2570 పరుగులు..

కోటార్ రామస్వామి 55 మ్యాచ్‌లు ఆడి 2570 పరుగులు చేశాడు. ఇందులో అతను 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2400 పరుగులు చేయగా, భారత్ తరపున ఆడిన 2 టెస్టుల్లో 170 పరుగులు చేశాడు. రామస్వామి తన 40 సంవత్సరాల 37 రోజుల వయస్సులో 1936లో భారతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్ ద్వారా అతని అరంగేట్రం జరిగింది. తద్వారా భారత్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రెండో వయోవృద్ధుడిగా నిలిచాడు. రామస్వామి అరంగేట్రం ఇంగ్లండ్‌లో జరిగింది. మాంచెస్టర్‌లో, అతను తన మొదటి టెస్టును ఆడాడు. కెరీర్‌లో రెండో టెస్టు లేదా ఓవల్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

రామస్వామి కెరీర్..

భారత్ తరపున ఆడిన రెండు టెస్టుల్లో కోటార్ రామస్వామి ప్రదర్శనను పరిశీలిస్తే, అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా ఉండగా, 56.66 సగటుతో 170 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరపున హాఫ్ సెంచరీ సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, అతను 28.91 సగటుతో 2400 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతను 2 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 127 నాటౌట్‌గా నిలిచింది. 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 30 వికెట్లు కూడా తీశాడు.

కోటార్ రామస్వామి క్రికెట్ ఆడేవాడు. కానీ, అదే సమయంలో 1922లో భారతదేశం తరపున డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఇద్దరు టెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.