India vs New Zealand : జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి.. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మాములుగా ఉండదు

India vs New Zealand : భారత క్రికెట్ జట్టుకు 2025 అద్భుతంగా గడిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడగా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. వన్డేల్లో, టీ20ల్లో సౌతాఫ్రికా పై ఘనవిజయాలు సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

India vs New Zealand : జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి.. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మాములుగా ఉండదు
Ind Vs Nz 2026

Updated on: Dec 20, 2025 | 2:51 PM

India vs New Zealand : భారత క్రికెట్ జట్టుకు 2025 అద్భుతంగా గడిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడగా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. వన్డేల్లో, టీ20ల్లో సౌతాఫ్రికా పై ఘనవిజయాలు సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ వచ్చే ఏడాది జరగనున్న మ్యాచ్‌లపైనే ఉన్నాయి. 2026 ప్రారంభంలోనే టీమిండియాకు అసలైన సవాల్ ఎదురుకానుంది.

వచ్చే ఏడాది అంటే 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్లు 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కి ముందు టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ఈ సిరీస్ ముగిసిన వెంటనే మన ఆటగాళ్లు నేరుగా వరల్డ్ కప్ బరిలోకి దిగుతారు.

భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్: ఈ వన్డే సిరీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

జనవరి 11: మొదటి వన్డే – వడోదర (కొతంబి స్టేడియం)

జనవరి 14: రెండో వన్డే – రాజ్‌కోట్

జనవరి 18: మూడో వన్డే – ఇండోర్

భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్: ఈ టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ 5 మ్యాచ్‌లు చాలా కీలకం.

జనవరి 21: మొదటి టీ20 – నాగ్‌పూర్

జనవరి 23: రెండో టీ20 – రాయ్‌పూర్

జనవరి 25: మూడో టీ20 – గువహటి

జనవరి 28: నాలుగో టీ20 – విశాఖపట్నం (వైజాగ్)

జనవరి 31: ఐదో టీ20 – తిరువనంతపురం

సొంత గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో కివీస్‌ను చిత్తు చేసి, అదే జోరుతో ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టాలని సూర్య సేన భావిస్తోంది. వైజాగ్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 కోసం తెలుగు అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..