
అండర్-19 ఆసియా కప్‌లో భారత్ యువ జట్టు శుభారంభం చేసింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగా క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్ధేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అర్షిన్ కులకర్ణీ ముందు బౌలింగ్‌లో (3/46), తర్వాత బ్యాటింగ్‌లో (70 నాటౌట్; 105 బంతుల్లో 4 ఫోర్లు) టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తోన్న అండర్-19 ఆసియా కప్ శుక్రవారం (డిసెంబర్ 8) ప్రారంభమైంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడింది. ఉదయ్ సహారన్ సారథ్యంలోని భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్‌ను 173 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత్ తరఫున రాజ్ లింబానీ, కులకర్ణి తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సహారన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో 20వ ఓవర్లలో 76 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇక్కడ నుంచి ఓపెనర్ అర్షిన్ కులకర్ణికి ముషీర్ ఖాన్ మద్దతు లభించింది. వీరిద్దరూ తర్వాతి 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలుపు తీరాలకు తీసుకెళ్లారు. అర్షిన్ 70 పరుగులు, ముషీర్ 48 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగారు. తద్వారా టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌లోనే బలమైన విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌కు ముందు ముషీర్ ఖాన్ గురించి చాలా చర్చ జరిగింది. భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు కావడంతో అందరి చూపు ముంబైకి చెందిన ఈ ఆల్ రౌండర్ పై పడింది. సుమారు 9 సంవత్సరాల క్రితం, సర్ఫరాజ్ దుబాయ్‌లోనే అండర్-19 జట్టులో అరంగేట్రం చేశాడు. ఈసారి తన సోదరుడికి ఈ అవకాశం దక్కింది. ముషీర్ ఆల్ రౌండర్ ప్రతిభను చాటుతూ మొదట తన స్పిన్‌తో 7 ఓవర్లలో 27 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ఆ తర్వాత 53 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇక మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన డాక్టర్ దంపతుల కుమారుడు అర్షిన్ కూడా సత్తా చాటాడు. మొదట తన మీడియం పేస్‌తో 8 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆపై 105 బంతుల్లో 70 పరుగులతో పోరాట ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
#TeamIndia off to a winning start in the #ACCMensU19AsiaCup 🙌🙌
They beat Afghanistan by 7 wickets at the ICC Academy Ground in Dubai 👌👌
Scorecard: https://t.co/4FgkV7W5HW pic.twitter.com/lXrAPruQlM
— BCCI (@BCCI) December 8, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..