IND vs NZ: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‎లో మొదటి స్థానానికి దూసుకెళ్లిన టీంమిండియా.. రెండో స్థానంలో న్యూజిలాండ్..

|

Dec 06, 2021 | 1:59 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత న్యూజిలాండ్‌పై 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

IND vs NZ: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‎లో మొదటి స్థానానికి దూసుకెళ్లిన టీంమిండియా.. రెండో స్థానంలో న్యూజిలాండ్..
India Vs New Zealand 2nd Test Mumbai
Follow us on

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత న్యూజిలాండ్‌పై 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్‎ను వెనక్కు నెట్టి  అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 107తో నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో సహా ఆ కాలంలో వారు ఆడిన మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకున్నారు, 12 టెస్ట్ విజయాలు. ఒక ఓటమిని నమోదు చేశారు. మరోవైపు అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌తోనూ ఆస్ట్రేలియా ఓడిపోయింది.

రెండో టెస్ట్‎లో కీవిస్ ను భారత్ ఓడించింది. సోమవారం న్యూజిలాండ్‎ను అలౌట్ చేసింది. జయంత్ యాదవ్ 4 వికెట్లు తీయగా, ఆర్ అశ్విన్ ఆఖరి వికెట్‌ పడగొట్టాడు. భారత్ న్యూజిలాండ్‌ను 372 పరుగుల తేడాతో చిత్తు చేసింది, ఇది టెస్ట్ క్రికెట్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం. మొదటి ఇన్నిన్నిగ్స్ లో 62 పరుగులకే ఆలౌటయిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులు చేసింది. అజాజ్ పటేల్ 14 వికెట్ల తీసి రికార్డు నెలకొల్పినప్పటికీ కివీస్ ఓడిపోయింది.

Read Also.. Ind vs NZ 2nd Test Match: సిరీస్ మనదే.. ముంబయి టెస్ట్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన..