ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. టీమిండియా మ్యాచ్ టైమింగ్స్‌లో కీలక మార్పులు.. ఎందుకంటే?

India Asian Games schedule: 2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు (India men's cricket team) నాకౌట్ మ్యాచ్‌ల (knockout matches) సమయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. నేరుగా క్వార్టర్ ఫైనల్ (quarter-final) చేరిన భారత్ సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు బరిలోకి దిగనుంది.

ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. టీమిండియా మ్యాచ్ టైమింగ్స్‌లో కీలక మార్పులు.. ఎందుకంటే?
India Asian Games Schedule

Updated on: Sep 12, 2026 | 9:08 PM

India Asian Games Schedule: ఐచి-నగోయా ఆసియా క్రీడలు 2026 (Aichi-Nagoya Asian Games 2026)లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్‌లో చివరి నిమిషంలో కీలక మార్పు చోటు చేసుకుంది. పురుషుల నాకౌట్ దశ మ్యాచ్‌లు 30 నిమిషాలు ముందుగా మొదలవుతాయి. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్‌కు నేరుగా అర్హత పొందిన భారత్, జపాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30కు బరిలోకి దిగనుంది. భారత కాలమానంలో ఉదయం 10 గంటలకు మొదలుకానుంది. గత షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 2 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, అంటే మన కాలమానం ప్రకారం ఉదయం 10:30లకు మొదలు కావాల్సి ఉండేది. తేదీలో ఎలాంటి మార్పు లేదు. అధికారిక వెబ్‌సైట్‌లో సవరణ కనిపిస్తున్నా, దాని సమాచారం భారత బృందానికి ఇంకా పూర్తిగా చేరలేదు.

ఈమార్పు ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న నిర్వహించే స్వర్ణ పతక పోరు కూడా జపాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30కే మొదలవుతాయి. ఉదయం జరిగే మ్యాచ్‌లకు మాత్రం పాత సమయాలే కొనసాగుతాయి. పాకిస్థాన్ (Pakistan) పాల్గొనే తొలి క్వార్టర్ ఫైనల్, తొలి సెమీఫైనల్, కాంస్య పతక మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. భారత కాలమానంలో ఇవి ఉదయం 5:30. లీగ్ దశ మ్యాచ్‌ల్లో మార్పు లేదు. మహిళల క్రికెట్ షెడ్యూల్ కూడా యథాతథంగానే సాగుతాయి.

ఈ మార్పు మొత్తం పోటీ తేదీలను మార్చలేదు. భారత్‌కు కేటాయించిన క్వార్టర్ ఫైనల్ సెప్టెంబర్ 28నే జరుగుతుంది. భారత ప్రేక్షకులకు కూడా మ్యాచ్ సమయం అరగంట ముందుకు వచ్చింది. పాత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30కు చూడాల్సిన పోరు, ఇప్పుడు ఉదయం 10 గంటలకే మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ కీలక మార్పు వెనుక ప్రధాన కారణం జపాన్‌లో సూర్యాస్తమయం త్వరగా రావడమేనని చెబుతున్నారు. క్రికెట్ వేదికలో ఫ్లడ్‌లైట్లు లేవు. పురుషుల మ్యాచ్‌లు మధ్యాహ్నం దాకా సాగితే వెలుతురు సమస్యగా మారే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రారంభాన్ని ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. మహిళల నాకౌట్ మ్యాచ్‌లకు ఇప్పటికే ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల ప్రారంభ సమయాలు ఉండటంతో ఆ విభాగంపై ప్రభావం పడలేదు.

భారత్‌కు ఆసియా క్రీడల పోటీకి ముందు జపాన్‌తో ఓ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ (T20I) ఉంది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు జపాన్ కాలమానంలో, భారత కాలమానంలో ఉదయం 9:30కు మొదలవుతుంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19న ప్రారంభమై అక్టోబర్ 4న ముగుస్తాయి. క్రికెట్ పోటీలు ఈ ఈవెంట్ ముగింపు దశలో జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us