
నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు 4 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. తిలక్ వర్మ 111 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు రింకూ సింగ్ 5 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 16 బంతుల్లోనే 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు కుమార్ కుషాగ్రా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 102 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. అతడిని లలిత్ రాజ్‌బన్షీ బౌలింగ్‌లో అవుట్ చేశాడు. ప్రస్తుతం నేపాల్ బౌలర్లలో పవన్ సరాఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.