IND vs WI: టీ20 సిరీస్‌ కోసం విండీస్ జట్టు.. రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లు.. హార్దిక్ సేనకు దబిడ దిబిడే..

Team India, News: భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ టీం తమ 15 మంది సభ్యులను ప్రకటించింది. గురువారం నుంచి తరుబాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కోసం విండీస్ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ , ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌లు చేరారు. రోవ్‌మన్ పావెల్ నేతృత్వంలోని ఈ 15 మంది సభ్యుల జట్టు అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఒక్కో మ్యాచ్‌కు 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారని, అందులో నుంచి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తామని క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది.

IND vs WI: టీ20 సిరీస్‌ కోసం విండీస్ జట్టు.. రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లు.. హార్దిక్ సేనకు దబిడ దిబిడే..
Ind Vs Wi T20i Series

Updated on: Aug 03, 2023 | 6:30 AM

IND vs WI, T20 Series: భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ టీం తమ 15 మంది సభ్యులను ప్రకటించింది. గురువారం నుంచి తరుబాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కోసం విండీస్ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ , ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌లు చేరారు. రోవ్‌మన్ పావెల్ నేతృత్వంలోని ఈ 15 మంది సభ్యుల జట్టు అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఒక్కో మ్యాచ్‌కు 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారని, అందులో నుంచి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తామని క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది.

టీ20 సిరీస్‌కు విండీస్ జట్టు..

భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 29 ఏళ్ల షాయ్ హోప్, గత ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటన సందర్భంగా కోల్‌కతాలో తన చివరి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. మరోవైపు, 26 ఏళ్ల థామస్ డిసెంబర్ 2021లో కరాచీలో తన చివరి T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. జట్టుకు వైస్ కెప్టెన్‌గా కైల్ మైయర్స్ నియమితులయ్యాడు. వచ్చే ఏడాది సొంతగడ్డపై జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ డెస్మండ్ హేన్స్ తెలిపారు.

ఈ ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్ల ఆకస్మిక ప్రవేశం..

డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ, ‘మేం సరైన కలయిక కోసం చూస్తున్నాం. వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మేం మంచి జట్టును సిద్ధం చేయాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది మేం ఆతిథ్యం ఇవ్వనున్న గ్లోబల్ టోర్నమెంట్‌లో ఈ జట్టు తన పాత్రను చక్కగా పోషించగలదని మేం విశ్వసిస్తున్నాం. ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ గురువారం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత, రెండు జట్లు ఆగస్టు 6, 8 తేదీలలో రెండు, మూడవ మ్యాచ్‌ల కోసం గయానా నేషనల్ స్టేడియంకు వెళ్తాయి. ఈ సిరీస్‌లో నాలుగో, ఐదో మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ జట్టు:

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మైయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకిల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్ ఒషానే థామస్.

టీమ్ ఇండియా:

ఇషాన్ కిషన్ (వికె), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికె), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

భారత్ vs వెస్టిండీస్ టీ20 సిరీస్..

1వ T20 మ్యాచ్, ఆగస్టు 3, రాత్రి 8.00 గంటలకు, ట్రినిడాడ్

2వ T20 మ్యాచ్, ఆగస్ట్ 6, రాత్రి 8.00 గంటలకు, గయానా

3వ టీ20 మ్యాచ్, ఆగస్టు 8, రాత్రి 8.00 గంటలకు, గయానా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..