IND Vs WI: అరంగేట్రంలోనే తెలుగోడి మెరుపులు.. 3 బంతుల్లో 2 సిక్సర్లు.. ఛాన్స్‌లిస్తే ఎవ్వరూ ఆపలేరు.!

|

Aug 04, 2023 | 9:47 AM

వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం జంకకుండా.. ఎదుర్కున్న రెండో బంతినే సిక్స్‌గా మలిచాడు. అలాగే ఆ తర్వాత బంతిని కూడా సిక్స్ కొట్టి.. మొదటి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదేశాడు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన నెటిజన్లు.. యువరాజ్, రైనాలను గుర్తు చేసుకున్నారు. టీమిండియాకు మరో రైనా దొరికేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కున్న తిలక్ వర్మ.. ప్రత్యర్ధి బౌలర్లను రఫ్ఫాడిస్తూ బంతులను స్టాండ్స్‌కు తరలించాడు.

IND Vs WI: అరంగేట్రంలోనే తెలుగోడి మెరుపులు.. 3 బంతుల్లో 2 సిక్సర్లు.. ఛాన్స్‌లిస్తే ఎవ్వరూ ఆపలేరు.!
Tilak Varma
Follow us on

అన్‌క్యాప్ద్ ప్లేయర్, హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటడమే కాకుండా.. మిడిలార్డర్‌లో టీమిండియాను మరో రైనా మాదిరిగా ఆదుకున్నాడు. శుబ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి హార్డ్ హిట్టర్లు విఫలమైన వేళ.. తిలక్‌వర్మ తనదైన శైలి బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల భరతం పట్టడమే కాకుండా.. టీంలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం జంకకుండా.. ఎదుర్కున్న రెండో బంతినే సిక్స్‌గా మలిచాడు. అలాగే ఆ తర్వాత బంతిని కూడా సిక్స్ కొట్టి.. మొదటి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదేశాడు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన నెటిజన్లు.. యువరాజ్, రైనాలను గుర్తు చేసుకున్నారు. టీమిండియాకు మరో రైనా దొరికేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కున్న తిలక్ వర్మ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడే టాప్ స్కోరర్. ప్రస్తుతం అతడి బ్యాటింగ్‌కి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్కంఠ పోరు.. చివర్లో భారత్‌కు భంగపాటు..

చివరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. కుల్దీప్ యాదవ్ మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ముఖేష్ కుమార్, చాహల్.. 5 బంతులకు 5 పరుగులే సాధించగలిగారు. దీంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హార్దిక్‌తో సహా.. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. కేవలం తిలక్ వర్మ(39) ఒక్కడే అదరగొట్టాడు. దీంతో 20 ఓవర్లకు టీమిండియా 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ చెరో రెండు వికెట్లు, అకేల్ హోసేన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, చాహల్ రెండేసి వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

వరల్డ్‌కప్ బెర్త్ ఖరారు.?

తిలక్ వర్మ వచ్చే రెండు టీ20లతో పాటు ఐర్లాండ్ సిరీస్‌లోనూ మంచిగా రాణిస్తే.. దాదాపుగా వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశం దక్కుతుంది. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇంకా పూర్తిగా ఫిట్ అయ్యేందుకు చాలా సమయం పట్టొచ్చు. దీంతో టీమిండియా వచ్చే సిరీస్‌ల్లో తిలక్ వర్మను అటు టీ20.. ఇటు వన్డేలో ప్రయత్నిస్తే.. మిడిలార్డర్ బలం పెరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.