IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం స్టాండ్‌బైలో ఇద్దరు ఆటగాళ్లు.. ఎవరంటే..?

|

Jan 30, 2022 | 12:33 PM

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ జట్టులోకి సెలక్టర్లు మరో ఇద్దరు ఆటగాళ్లను చేర్చుకున్నారు.

IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం స్టాండ్‌బైలో ఇద్దరు ఆటగాళ్లు.. ఎవరంటే..?
Shahrukh Khan Sai Kishore
Follow us on

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ జట్టులోకి సెలక్టర్లు మరో ఇద్దరు ఆటగాళ్లను చేర్చుకున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం జట్టులోని ప్రధాన జట్టులో భాగం కాలేరు. అయితే అవసరమైతే వారిని చేర్చుకోవచ్చు. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా ఉంచింది. వన్డే జట్టు ప్రకటన తర్వాత,స్టాండ్‌బైలో ఉంచిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరు షారుక్ ఖాన్ మరొకరు సాయి కిషోర్. కరోనా థర్డ్‌ వేవ్ వల్ల సిరీస్‌కి ఎటువంట ఆటంకాలు రాకూడదని బోర్డు కోరుకుంటోంది. కాబట్టి అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఈ కారణంగానే ఇద్దరు ఆటగాళ్లను స్టాండ్‌బైలోకి చేర్చారు.

షారుఖ్, సాయి కిషోర్ స్టాండ్ బైగా ఉంటారు

షారుఖ్ ఖాన్ తమిళనాడుకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాడు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్‌లో చాలా ఘనత సాధించాడు. ఇది కాకుండా, సాయి కిషోర్ నిష్ణాతుడైన బౌలర్ అతను నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ ఇద్దరు స్టాండ్‌బై ఆటగాళ్లతో తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా వెస్టిండీస్‌తో వన్డే జట్టులో చేర్చారు.

తమిళనాడు కష్టాలను పెంచిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియాలో ఈ ముగ్గురు ఆటగాళ్లను ఎంపికతో తమిళనాడుకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారి రంజీ జట్టులో ఈ ముగ్గురికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనవలసి ఉంటుంది. మరో 2 రోజుల్లో తమిళనాడు జట్టు కూర్పుపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే వాషింగ్టన్ సుందర్ మళ్లీ తమిళనాడు జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ కోసం తమిళనాడు జట్టులోకి ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌ను ఎంపిక చేయవచ్చు. అయితే ముందుగా ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. మోకాలి గాయం కారణంగా గత 2 నెలలుగా నటరాజన్ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ ఫిబ్రవరి 13 నుంచి మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ శంకర్ తమిళనాడు జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం
ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న జరగనుంది. కాగా మూడో మ్యాచ్ ఫిబ్రవరి 11న జరగనుంది. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి.

QR కోడ్‌ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త.. ఒక్క పొరపాటు మీ ఖాతాని ఖాళీ చేస్తుంది..?

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్యాసింజర్, స్కూల్ బస్సులలో అవి తప్పనిసరి..?

ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?