India vs West Indies 3rd ODI Highlights:: మూడో వన్డేలో భారత్ గెలుపు.. చెలరేగిన బౌలర్లు..

Basha Shek

| Edited By: Srinivas Chekkilla

Updated on: Feb 11, 2022 | 9:01 PM

India vs West Indies 3rd ODI Highlights: భారత్‌, వెస్టిండీస్‌ (IND vs WI) జట్ల మధ్య నేడు (ఫిబ్రవరి11)న చివరి వన్డే జరుగుతుంది. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న..

India vs West Indies 3rd ODI Highlights:: మూడో వన్డేలో భారత్ గెలుపు.. చెలరేగిన బౌలర్లు..
India Vs West Indies

India vs West Indies 3rd ODI Highlights: భారత్‌, వెస్టిండీస్‌ (IND vs WI) జట్ల మధ్య నేడు (ఫిబ్రవరి11)న చివరి వన్డే జరుగుతుంది. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. మరోవైపు కనీసం చివరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు దక్కించుకుందామని కరీబియన్‌ జట్టు ప్రయత్నిస్తోంది. కాగా నామమాత్రమైన ఈ మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కొన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, పేసర్‌ ఆవేశ్‌ఖాన్లకు తుది జట్టులో స్థానం కల్పించే అవకాశముంది. కాగా అహ్మదాబాద్‌ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరిగిన మొదటి రెండు వన్డేల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే వేదికగా జరిగే చివరి వన్డేలోనూ విండీస్ ను వైట్ వాష్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

ప్లేయింగ్ XI : భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్‌ ధావన్‌ , విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్),  శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్,  వాషింగ్టన్ సుందర్,  దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్,  కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్ కృష్ణ.

వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, శర్మ బ్రూక్స్, జాసన్ హోల్డర్, ఓడియన్‌ స్మిత్, ఫాబియన్ అలెన్,  హెడెన్ వాల్ష్,  అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 Feb 2022 08:47 PM (IST)

    169 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. కష్టల్లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. దీంతో శ్రేయస్, పంత్‌ల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు.

    క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తో్న్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు, జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. అలెన్, స్మిత్ చేరో వికెట్ పడగొట్టారు.

    266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ ఏ దశలోను విజయం సాధించేలా కనిపించ లేదు. క్రమం తప్పుకుండా వికెట్లు కోల్పోయింది. 169 పరుగులకు ఆలౌట్ అయింది. ఒడియన్ స్మిత్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ 34 పరుగులు చేశాడు.

  • 11 Feb 2022 08:38 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

    అహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్‌కు దాదాపు ఓటమి ఖాయమైంది. ఇప్పటికే ఆ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 9వ వికెట్‌గా వాల్ష్ వెనుదిరిగాడు. వెస్టిండీస్ ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

  • 11 Feb 2022 07:50 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..

    అహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ ఓటమి వైపు అడుగులు వేస్తుంది. భారత బౌలర్ల దాటికి వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇప్పుటికే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 8వ వికెట్‌గా ఒడియన్ స్మిత్ ఔటయ్యాడు.

  • 11 Feb 2022 07:35 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

    మూడో వన్డే వెస్టిండీస్ ఎదురిదుతోంది.. ఆ జట్టు ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోయింది. ఏడో వికెట్‌గా నికోలస్ పూరన్ వెనుదిరిగాడు. కుల్దీప్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పూరన్ 39 బంతుల్లో 34 పరుగులు చేశారు.

  • 11 Feb 2022 07:21 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

    మూడో వన్డేలో వెస్టిండీస్ ఓటమి దిశగా కొనసాగుతోంది. ఇప్పుటికే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా అలెన్ వెనుదిరిగాడు.

  • 11 Feb 2022 07:05 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..

    భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వద్ద డారన్ బ్రవో  ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 11 Feb 2022 06:33 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

    ముడో వన్డేలో వెస్టిండీస్ తడబడుతుంది. ఛేదనలో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బ్రూక్స్ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 11 Feb 2022 06:19 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్‌.. కింగ్ ఔట్

    266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బ్రండన్ కింగ్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో సూర్యాకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

  • 11 Feb 2022 06:12 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. హోప్ ఔట్

    భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. హోప్ 5 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

  • 11 Feb 2022 06:02 PM (IST)

    వెస్టిండీస్ ఇన్నింగ్స్

    ఆహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ 266 పరుగులు విజయ లక్ష్యంతో ఛేదన మొదలు పెట్టింది.

  • 11 Feb 2022 05:23 PM (IST)

    భారత్ ఆలౌట్..

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది.  ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. కష్టల్లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు.

    భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. దీంతో శ్రేయస్, పంత్‌ల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తో్న్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

  • 11 Feb 2022 05:20 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. సుందర్ ఔట్

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 33 వద్ద ఔట్ అయ్యాడు.

  • 11 Feb 2022 05:14 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన కుల్దీద్ యాదవ్ ఔట్ అయ్యాడు.

  • 11 Feb 2022 05:01 PM (IST)

    ఏడో వికెట్ కోల్పయిన భారత్.. దీపక్ చాహర్ ఔట్..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన దీపక్ చాహర్ ఔట్ అయ్యడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

  • 11 Feb 2022 04:56 PM (IST)

    దాటిగా ఆడుతున్న దీపక్ చాహర్..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దీపక్ చాహర్ దాటిగా ఆడుతున్నాడు.  ప్రస్తుతం 35 బంతుల్లో 35 పరుగులు చేశాడు.. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

  • 11 Feb 2022 04:31 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. 80 పరుగుల వద్ద శ్రేయస్‌ ఔట్..

    వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 80 పరుగుల వద్ద శ్రేయస్‌ అయ్యర్ ఔటయ్యాడు. 111 బంతుల్లో 80 పరుగులు చేసిన అయ్యర్‌ వాల్ష్ బౌలింగ్‌లో బ్రవోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి.

  • 11 Feb 2022 04:13 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్యాకుమార్ యాదవ్ ఔట్

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సూర్యాకుమార్ యాదవ్ అలెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో సూర్యాకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

  • 11 Feb 2022 03:52 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. పంత్ ఔట్..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ వాల్ష్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  పంత్ 54 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్, సూర్యాకుమార్ యాదవ్ ఉన్నారు.

  • 11 Feb 2022 03:50 PM (IST)

    రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. అతను 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ప్రస్తుతం భారత్ 29.2 ఓవర్లకు 147 చేసింది. క్రీజ్‌లో పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు.

  • 11 Feb 2022 03:40 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. అయ్యర్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా 27.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

  • 11 Feb 2022 02:28 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్.. శిఖర్ ధావన్ ఔట్‌ క్రీజ్‌లోకి పంత్..

    వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 10వ ఓవర్‌లో ఒడియన్ స్మిత్ బౌలింగ్‌లో ధావన్‌ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శిఖర్ 26 బంతుల్లో 10 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్ ఉంది. ప్రస్తుతం ఇండియా 11 ఓవర్లకు 42 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్, పంత్ ఉన్నారు…

  • 11 Feb 2022 02:11 PM (IST)

    నిలకడగా టీమిండియా బ్యాటింగ్.. 8 ఓవర్లకు టీమిండియా స్కోరు 33/2..

    వెంట వెంనటే రెండు వికెట్లు కోల్పోవడంతో ఓపెనర్ ధావన్, మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విండీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.  8 ఓవర్లకు టీమిండియా స్కోరు 33/2 . ప్రస్తుతం  ధావన్ 9 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో  క్రీజ్ లో ఉన్నారు.

  • 11 Feb 2022 01:55 PM (IST)

    వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. పెవిలియన్ చేరిన రోహిత్, కోహ్లీ..

    మూడు బౌండరీలతో ఊపుమీదున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (13) పెవిలియన్ కు చేరుకున్నాడు.  అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అలాగే విరాట్  కోహ్లీ (0)  కూడా రెండు బంతులకే పరిమితమయ్యాడు. ఖాతా తెరవ కుండానే వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజ్ లో ధావన్(0), శ్రేయస్ అయ్యర్ (0) ఉన్నారు.  4.3 ఓవర్లకు టీమిండియా స్కోరు 17/0..

  • 11 Feb 2022 01:46 PM (IST)

    బౌండరీలతో అదరగొడుతోన్న హిట్ మ్యాన్.. మూడు ఓవర్లకు టీమిండియా స్కోరు 16/0..

    మూడో వన్డేలో హిట్ మ్యాన్ అదరగొడుతున్నాడు.  ఇప్పటివరకు మూడు బౌండరీలు బాదాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంకా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం మూడు ఓవర్లకు టీమిండియా స్కోరు 16/0. రోహిత్ 13 పరుగులతో జోరు మీదున్నాడు.

  • 11 Feb 2022 01:29 PM (IST)

    మూడో వన్డేలో పలు మార్పులు చేసిన టీమిండియా..

    నామమాత్రమైన మూడో వన్డేలో పలు మార్పులు చేసింది టీమిండియా. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.  మిడిలార్డర్ లో వస్తాడనుకున్న కే.ఎల్. రాహుల్ కు విశ్రాంతినిచ్చారు. అలాగే ఆల్ రౌండర్ దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు చోటు కల్పించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు స్థానం కల్పించారు.

  • 11 Feb 2022 01:16 PM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..

    అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ లకు కూడా తుది జట్టులో స్థానం దక్కింది.  దీపక్ హుడా, కే.ఎల్.రాహుల్ లకు విశ్రాంతినిచ్చారు.

Published On - Feb 11,2022 1:08 PM

Follow us