IND vs WI: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. కట్‌చేస్తే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు లక్కీ ఛాన్స్.. భారత జట్టులోకి డేంజరస్ ఫినిషర్..

|

Jun 27, 2023 | 1:35 PM

IND vs WI Series: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున డేంజరస్ ఫినిషర్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్‌.. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినినిపిస్తున్నాయి.

IND vs WI: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. కట్‌చేస్తే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు లక్కీ ఛాన్స్.. భారత జట్టులోకి డేంజరస్ ఫినిషర్..
Rinku Singh
Follow us on

Rinku Singh: వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఇప్పటికే టీమిండియాను ప్రకటించింది. అయితే చివరి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మాత్రం స్వ్కాడ్‌ను ప్రకటించలేదు. టీ20 సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో పాటు హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, ఐపీఎల్ 2023లో సిక్సర్లతో దుమ్మురేపిన తుఫాన్ ప్లేయర్‌ కూడా అరంగేట్రం చేయనున్నాడు.

ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున డేంజరస్ ఫినిషర్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్‌.. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినినిపిస్తున్నాయి. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం మంచి ఫినిషర్ కోసం వెతుకుతోంది. అంతకుముందు దినేష్ కార్తీక్‌కు మరోసారి ఫినిషర్ అవకాశం ఇచ్చారు. కానీ, అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రిషబ్ పంత్ గాయపడ్డాడు. కాబట్టి టీమిండియాకు యువ ఫినిషర్ అవసరం చాలా ఉంది.

ఇప్పుడు BCCI IPL 2023లో వరుసగా 5 సిక్సర్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రింకూ సింగ్‌ని భారత జట్టులోకి తీసుకురావడం గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న మహ్మద్ షమీ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఆగస్టు 3న బ్రియాన్ లారా స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. రెండో టీ20 6న, మూడో టీ20 ఆగస్టు 8న నిర్వహించనున్నారు. నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌లు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఐదు టీ20 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..